విశాఖపట్నం: వేట కోసం సముద్రంలోకి వెళ్లిన ఎనిమిది మంది ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులు బంగ్లాదేశ్ సముద్ర సరిహద్దుల్లోకి వెళ్ళడంతో అక్క...
విశాఖపట్నం: వేట కోసం సముద్రంలోకి వెళ్లిన ఎనిమిది మంది ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులు బంగ్లాదేశ్ సముద్ర సరిహద్దుల్లోకి వెళ్ళడంతో అక్కడి కోస్ట్ గార్డ్ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు.ఈనెల 13వ తేదీన విశాఖపట్నం హార్బర్ నుంచి బయలుదేరిన IND-AP-V5-MM-735 మెకనైజ్డ్ ఫిషింగ్ బోటులో వీరు వేటకు వెళ్లారు. వేటలో భాగంగా బంగ్లాదేశ్ జలప్రాంతంలోకి అనుకోకుండా ప్రవేశించడంతో, అక్కడి కోస్ట్‌గార్డులు వీరిని అరెస్ట్ చేసి స్థానిక పోలీసులకు అప్పగించారు.అరెస్టయిన వారులో పూసపాటిరేగ మండలం తిప్పలవలస గ్రామానికి చెందిన వాసుపల్లి సీతయ్య, నక్క రమణ, భోగాపురం మండలం కొండరాజపాలెం గ్రామానికి చెందిన మారుపల్లి చిన్నప్పన్న, సురాడ అప్పలకొండ, సురపతి రాము, మారుపల్లి రమేష్, మారుపల్లి ప్రవీణ్ ఉన్నారు.వీరు అందరూ విజయనగరం జిల్లాకు చెందినవారే అయినా, ప్రస్తుతం జీవనోపాధి కోసం విశాఖపట్నంలో నివాసం ఉంటున్నారు. తమ కుటుంబ సభ్యులు బంగ్లాదేశ్ పోలీసుల చెరలో చిక్కినట్టు తెలిసి ఆందోళన వ్యక్తం చేస్తూ, వారిని త్వరగా విడిపించి స్వదేశానికి తీసుకురావాలని భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు.
COMMENTS