పర్యాటక అభివృద్ధికి పలు సూచనలు... ఎడ్లపాడు మండలం, ఆంధ్ర గోల్కొండగా పేరుగాంచిన చారిత్రక కొండవీడు కోటను జిల్లా కలెక్టర...
పర్యాటక అభివృద్ధికి పలు సూచనలు...
ఎడ్లపాడు మండలం, ఆంధ్ర గోల్కొండగా పేరుగాంచిన చారిత్రక కొండవీడు కోటను జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా మంగళవారం సందర్శించారు. ఈ పర్యటనలో ఆమెతో పాటు జిల్లా అటవీశాఖ అధికారి (DFO) కృష్ణ ప్రియ కూడా ఉన్నారు.కొండవీడు కోట ప్రాశస్త్యాన్ని, చారిత్రక నిర్మాణాలను పరిశీలించిన కలెక్టర్ కృతికా శుక్లా , కొండవీడును ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే దిశగా పలు కీలక సూచనలు చేశారు.
కొండవీడు కోట చారిత్రక వైభవాన్ని కాపాడటంతో పాటు, పర్యాటకులకు మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ముఖ్యంగా పర్యాటకుల సౌకర్యార్థం కల్పించాల్సిన మౌలిక వసతులు, భద్రతా ఏర్పాట్లు, పర్యావరణ పరిరక్షణ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పర్యాటక అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు, పనుల పురోగతిని డీఎఫ్‌ఓ కృష్ణ ప్రియ తో చర్చించారు. భవిష్యత్తులో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలపై కూడా కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.కొండవీడుకు ఉన్న చారిత్రక ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని, దీనిని ప్రపంచ పర్యాటక పటంలో నిలిపేందుకు సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ కృతికా శుక్లా అధికారులకు తెలిపారు.
COMMENTS