చిలకలూరిపేట పట్టణానికి చెందిన జగ్గురోతి లక్ష్మణరావు, సీతమ్మ దంపతుల మనవరాలు, చిరంజీవి దివ్యశ్రీ యొక్క పుష్పాలంకరణ వేడుక అత్యంత వై...
చిలకలూరిపేట పట్టణానికి చెందిన జగ్గురోతి లక్ష్మణరావు, సీతమ్మ దంపతుల మనవరాలు, చిరంజీవి దివ్యశ్రీ యొక్క పుష్పాలంకరణ వేడుక అత్యంత వైభవంగా జరిగింది.ఈ శుభకార్యాన్ని పట్టణంలోని వెంకటేశ్వర థియేటర్ సమీపంలో ఉన్న జంపనిభాస్కర్ కళ్యాణ మండపంలో కుటుంబ సభ్యులు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
మండలనేని చరణ్ తేజ ముఖ్య అతిథి..
ఈ వేడుకకు ప్రముఖులు, జనసైనికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముఖ్య అతిథిగా మండలనేని చరణ్ తేజ విచ్చేసి దివ్యను ఆశీర్వదించారు. ఆయనతో పాటు నియోజకవర్గ జనసేన సమన్వయకర్త తోట రాజా రమేష్ కూడా పాల్గొని చిన్నారి దివ్యశ్రీ కు శుభాకాంక్షలు తెలిపారు.జనసైనికులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై దివ్యను ఆశీర్వదించారు. జగ్గురోతి కుటుంబ సభ్యులు, బంధువులు, జనసైనికులు, పలువురు ప్రముఖుల సమక్షంలో దివ్య యొక్క పుష్పాలంకరణ వేడుక కనుల పండువగా జరిగింది. ఈ వేడుక ద్వారా దివ్యశ్రీ కు అందరూ శుభాకాంక్షలు తెలియజేశారు.
COMMENTS