పల్నాడు జిల్లా గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా తెలిపార...
పల్నాడు జిల్లా గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని వీక్షణ సమావేశ మందిరంలో ఎస్పీ కృష్ణారావు తో కలిసి మాదకద్రవ్య నివారణ జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు.
పాఠశాలల్లో, కళాశాలలో ఈగల్ టీం లను ఏర్పాటు చేసి మాదక ద్రవ్య వినియోగం వలన కలిగే నష్టాలను గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలో నిషేధిత మాదకద్రవ్యాల వినియోగం, అమ్మకాలపై కేసులు నమోదు చేయాలన్నారు. పాఠశాలల్లో డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదంతో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. అధికారులందరూ సమన్వయంతో పని చేయాలన్నారు. అన్ని శాఖలు పోలీస్ శాఖకు సహాయ సహకారాలు అందించాలని తెలిపారు.మున్సిపల్ కమిషనర్లు,మండల పరిషత్ అధికారులు వారి ప్రాంతాల్లో సమస్యాత్మక ప్రదేశాలు గుర్తించి వాటిలో గల పాత భవనాలు ఉండకుండా చూడాలన్నారు. అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటాయని అన్నారు. వాటిని అరికట్టాలని అన్నారు. ఆ ప్రదేశాలలో సీసీ కెమెరాలు, లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో అటువంటి సమస్యాత్మక ప్రదేశాలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.ఆ సమస్యాత్మక ప్రదేశాల్లో ఉన్నటువంటి భవనాలు ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినవయితే వారికి నోటీసులు ఇచ్చి వాటిని ఉపయోగంలోనికి తీసుకురావాలన్నారు. ప్రభుత్వంకు సంబంధించినవి అయితే వాటిని వెంటనే తొలగించాలన్నారు. పోలీస్ శాఖ వారు పాఠశాలలకు, కళాశాలకు, వసతి గృహాలకు వెళ్ళి విద్యార్థులకు డ్రగ్స్ పై అవగాహన కల్పించాలన్నారు.
ఎస్పీ కృష్ణారావు మాట్లాడుతూ.....
జిల్లా వ్యాప్తంగా గుర్తించిన గంజాయి హాట్‌స్పాట్‌లపై పోలీసులు నిఘా ఏర్పాటు చేసినట్లు,మాదక ద్రవ్యాల సంబంధిత కార్యకలాపాల్లో ఉన్న అనుమానిత వ్యక్తుల నివాస ప్రాంతాలను అధికారులు తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు.
పట్టణ ప్రాంతాల్లో అసంపూర్తిగా నిర్మించిన భవనాలు, ఖాళీగా వదిలివేసిన భవనాలలో కార్యకలాపాలపై నిఘా ఉంచాలన్నారు. పిట్ ఎన్.డి.పి.ఎస్ చట్టం కింద ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదై, ఎక్కువ మొత్తంలో గంజాయి సరఫరా చేస్తూ లేదా అమ్ముతూ దొరికిన వారి ఆస్తులు జప్తు చేస్తామన్నారు.
మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించేందుకు స్కూళ్లస్థాయి నుండి విశ్వవిద్యాలయాల వరకు అన్ని విద్యా సంస్థలలో ఈగిల్ క్లబ్‌లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని తెలిపారు.డీ-అడిక్షన్ సెంటర్లు, పునరావాస సహాయం కోసం అవుట్‌రీచ్ ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు.ఏరియా హాస్పిటల్ నందు ఉన్న డీ-అడిక్షన్ సెంటర్, కొత్తగా ఏర్పాటైన డీ-అడిక్షన్ సెంటర్ నందు అవసరమైన సిబ్బందిని నియమించాలని డీఎంహెచ్ఓ ను కోరారు.మాత జ్ఞానమ్మ డీ-అడిక్షన్ సెంటర్ ను సైకియాట్రిస్ట్ గారు నెలకు రెండు సార్లు విజీట్ చేయాలన్నారు.
మాదక ద్రవ్య దుర్వినియోగ నిర్మూలన లో బాధ్యతాయుతమైన అన్ని శాఖల సమన్వయంతో చురుకుగా పాల్గొనాలన్నారు. మాదక ద్రవ్యాల పై అవగాహన ఇంటర్ - డిపార్ట్‌మెంటల్ సహకారంతో వీలైనన్ని ఎక్కువ అవగాహన కార్యక్రమాల ద్వారా విద్యార్దులు మరియు ప్రజలలో మాదక ద్రవ్యాల వలన కలిగే నష్టాలపై చైతన్యం కలిగించాలని తెలిపారు.
ఈ సమావేశంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ ,జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారులు,డి.ఈ.ఓ
జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమాదికారి .జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ ,ఈగల్ సెల్ ఎస్సై తదితరులు పాల్గొన్నారు.
COMMENTS