చిలకలూరిపేట పట్టణంలోని 52 ఎకరాల టిడ్కో గృహాల కాలనీలో పోలీసులు మంగళవారం తెల్లవారుజామున విస్తృత కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస...
చిలకలూరిపేట పట్టణంలోని 52 ఎకరాల టిడ్కో గృహాల కాలనీలో పోలీసులు మంగళవారం తెల్లవారుజామున విస్తృత కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్‌పీ హనుమంతరావు, సీఐ రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో ఏడుగురు ఎస్ఐలు, వందమంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.తనిఖీల సమయంలో సరైన పత్రాలు, ఆధారాలు లేని 90కు పైగా మోటార్ బైక్‌లను పోలీసులు సీజ్ చేశారు. ప్రతి ఇంటిలో ఎవరు నివసిస్తున్నారనే దానిపై పోలీసులు క్షుణ్ణంగా వివరాలు సేకరించారు. గంజాయి, డ్రగ్స్ వంటి నిషేధిత ఉత్పత్తులు నిల్వచేసిన లేదా స్మగ్లింగ్ చేస్తున్న వారెవరైనా కనుక్కొంటే, ఎవరిని వదిలిపెట్టమని డీఎస్‌పీ హనుమంతరావు హెచ్చరించారు.
ఇక అసంఘీక కార్యక్రమాలలో పాల్గొనేవారిపై, మారణాయుధాలు వాడేవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆయన స్పష్టంచేశారు. సంఘవిద్రోహ శక్తులతో సంబంధాలు ఉన్నారా లేదా అనే కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. పట్టణంలో శాంతి భద్రతలను కాపాడేందుకు ఈ తనిఖీలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.
COMMENTS