జిల్లాలో నేటి నుండి రైతుల సమక్షంలో 3వ దశ రీసర్వే ప్రారంభం నరసరావుపేట:ప...
జిల్లాలో నేటి నుండి
రైతుల సమక్షంలో 3వ దశ రీసర్వే ప్రారంభం
నరసరావుపేట:పల్నాడు జిల్లాలో అక్టోబర్ 3 నుండి 3వ దశ రీసర్వే ప్రారంభం అవుతున్న నేపధ్యంలో రైతులు గమనించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లాలో 150 గ్రామాలలో రీసర్వే పూర్తి చేశామని, ప్రస్తుతం మరో 41 గ్రామాలలో జరుగుతుందని అన్నారు. 3వ దశలో 25 గ్రామాలలో రీసర్వే చేయబోతున్నామని తెలిపారు. రైతులందరూ రీసర్వే కి సహకరించాలని కోరారు. రెవెన్యూ సిబ్బంది మీ భూమి సర్వే ఎప్పుడు చేస్తారో ముందుగా నోటిసు ద్వారా తెలియజేస్తారని, ఆ సమయంలో రైతులు తప్పనిసరిగా హాజరుకావాలని విజ్ఞప్తి చేసారు. అలాగే రీసర్వేలో రైతుల నుండి అందిన అభ్యంతరాలను పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తెలిపారు.
COMMENTS