దీపావళి భద్రత నిర్వహణపై జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా పల్నాడు: ఎలాంటి ప్రమాదాలకు తావులేకుండా.....
పల్నాడు: ఎలాంటి ప్రమాదాలకు తావులేకుండా.. అన్ని జాగ్రత్తలు పాటిస్తూ దీపావళి పండుగను జిల్లా ప్రజలందరూ ఆనందంగా, ఆహ్లాదకరంగా జరుపుకునేలా చర్యలు తీసుకోవాలని
కలెక్టర్ కృతిక శుక్లా అధికారులను ఆదేశించారు.
కలెక్టరేట్ లో దీపావళి పండుగను పురస్కరించుకుని బాణసంచా స్టాళ్ల అనుమతులు, భద్రతా చర్యలు, నిబంధనల పాటింపు.. తదితర అంశాలపై..జిల్లా ఎస్పీ కృష్ణారావు తో కలిసి డిఆర్వో, ఆర్డీవోలు,సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాకు సంబంధించి బాణసంచా దుకాణదారులకు లైసెన్స్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ధ్వని కాలుష్య నియంత్రణకు అధికారులు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ నియమ నిబంధనలు, అన్ని రకాల భద్రత చర్యలను తప్పక పాటిస్తూ.. సంప్రదాయ పండుగను సంతోషంగా నిర్వహించుకునేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వం జారీ చేసిన విధివిధానాలను తూచా తప్పకుండా పాటించాలన్నారు.
ముఖ్యంగా ప్రభుత్వ అనుమతి లేకుండా ఏ ఒక్కరూ ఒక్క బాణసంచా దుకాణం నిర్వహించకూడదన్నారు. నిబంధనలను ఉల్లంఘించే షాపులను సీజ్ చేయాలన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్టాళ్లలోనే టపాసులు కొనుగోలు చేయాలన్నారు. ఎక్కడ పడితే అక్కడ బహిరంగంగా బాణసంచా దుకాణాలు నిర్వహిస్తే.. విక్రయదారులపై కేసులు నమోదు చేయాలని సంబందిత అధికారులను ఆదేశించారు.నిబంధనల మేరకు షాపులు ఏర్పాటు చేస్తున్నారా లేదా అని రెవిన్యూ అధికారులు తనిఖీ చేయాలన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. షాపులు ఏర్పాటు చేసిన ప్రాంతంలో వాహనాల పార్కింగ్, పబ్లిక్ అడ్రస్ సిస్టం ను ఏర్పాటు చేయాలన్నారు.
ఆర్డీఓలు అన్ని బాణసంచా తయారీ గోడౌన్లను, స్టాళ్లను పరిశీలించి.. అనుమతులు ఉన్నవాటికి పర్మిషన్లు, పర్మిషన్ ముగిసిన స్టాళ్లకు రెన్యూవల్ చేయించే చర్యలు చేపట్టాలన్నారు. అలాగే తమ పరిధిలో లైసెన్స్ ఇచ్చే ముందు షాపుల వారితో సమావేశం నిర్వహించి తగు ఆదేశాలు ఇవ్వాలని అందరూ ఆర్డీవోలను ఆదేశించారు.
అందుకు సంబంధించి విధివిధానాలను ఇప్పటికే సంబందిత శాఖల అధికారులకు పంపించడం జరిగిందన్నారు. విద్యుత్, అగ్నిమాపక, పోలీసు, మున్సిపల్, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో.. ప్రజలు దీపావళి పండుగను సంతోషంగా, సురక్షితంగా జరుపుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.
టపాకాయల విక్రయ దుకాణదారులు సురక్షాపరమైన జాగ్రత్తలు తీసుకోనేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశించారు ,పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దీపావళి పండుగ నిర్వహించుకోవాలని టపాకాయల విక్రయదారులు కమిటీ సభ్యులకు సూచించారు.
బాణసంచా విక్రయకేంద్రాల నిర్వాహకులు ఈ క్రింది నిబంధనలను తప్పక పాటించాలని సూచించారు.
షాపుల ముందు ఇసుక, నీటి బక్కెట్లు వంటి ఫైర్ అండ్ సేఫ్టీ నిబంధనలను పాటించేల చర్యలు తీసుకోవాలి.
బాణసంచా విక్రయ శాలల మధ్య నిబంధనలకు లోబడి డిస్టెన్స్ పాటించేలా చర్యలు తీసుకోవాలి.
స్టాళ్ల ముందు అన్నిరకాల బాణసంచాకు సంబంధించి ధరల పట్టికలను బహిరంగంగా ప్రదర్శించాలి.
స్టాళ్ల వద్ద, పరిసర ప్రాంతాల్లో పారిశుద్ద్య చర్యలు చేపట్టాలి.
చేయదగినవి (DOs)
1. లైసెన్స్కలిగి ఉన్న విశ్వసనీయ అమ్మకందారుల నుండి బాణసంచా కొనుగోలు చేయాలి
2. బాణసంచా వినియోగాన్ని ఎల్లప్పుడూ పెద్దలు పర్యవేక్షించాలి
3. బాణసంచాపై ముద్రించవబడిన భద్రతా జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి
4. బాణసంచా కాల్చడానికి కొవ్వొత్తి లేదా అగర్బత్తిని వాడవలెను
5. ప్రారంభ మంటలను ఆర్పడానికి ఎల్లప్పుడూ ఒక బకెట్ నీటిని అందుబాటులో ఉంచండి
6. ఏరియల్ బాణసంచాను సురక్షిత ల్యాండింగ్ జోన్లో ఉపయోగించాలి
7. బాణసంచాను నీటిలో నానబెట్టి వాటిని సరిగ్గా పారవేయండి.
చేయకూడనివి (Donts)
1.రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య శబ్దాలను వెదజల్లే బాణాసంచా పేల్చవద్దు
2. బాణాసంచాను చేతిలో పట్టుకొని కాల్చవద్దు. వాటిని క్రింద పెట్టి, ఆపై వాటిని మండించి, దూరంగా నడవండి
3. బాణసంచా కాల్చడానికి ఏదైనా కంటైనర్లో పెట్టవద్దు
4. ఏదైనా పనిచేయని బాణాసంచాను విడిచిపెట్టవలెను
5.బహిరంగ ప్రదేశంలోకి వెళ్ళే పథంలో అంతరాయం కలిగించే కట్టడముల ప్రవేశం, కిటికీలు దగ్గర ఎప్పుడూ ఏరియల్ (ఓవర్ హెడ్ అడ్డంకులు చెట్లు, ఆకులు, తీగ మొదలైనవి) బాణసంచా కాల్చవద్దు. భవనం/ఇండ్లు, కిటికీల వద్ద ఇతర బాణసంచా కాల్చకండి. ఓపెన్ గ్యారేజ్ డోర్/ విండో ఏరియల్ బాణసంచాను లోపలకు ఎగరడానికి అవకాశం ఇస్తుంది
6.ఇంటి లోపల ఎప్పుడూ బాణసంచా ఉపయోగించవద్దు
7. బహిరంగ మార్గంలో కాకుండా ఆరుబయట బాణాసంచా ఉపయోగించండి
8. ఎప్పుడూ బాణసంచాతో ప్రయోగాలు చేయవద్దు లేదా స్వంతంగా బాణసంచా తయారు చేయవద్దు
9. వెలగని బాణసంచాని మళ్లీ వెలిగించవద్దు (15 నుండి 20 నిమిషాలు వేచి ఉండి), ఆపై దానిని ఒక బకెట్ నీటిలో నానబెట్టండి
10. నకిలీ బాణాసంచా ఉపయోగించవధ్దు
11. పిల్లలను ఒంటరిగా బాణసంచా కాల్చడానికి అనుమతించవద్దు
ప్రజలు, విక్రయదారులు సురక్షిత చర్యలు తీసుకుని దీపావళిని ఆనందంతో, సంతోషంతో జరుపుకోవాలని కోరారు.ఎటువంటి ప్రమాద పరిస్థితులకు తావివ్వరాదని జిల్లా కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు ,జిల్లా చీఫ్ ఫైర్ ఆఫీసర్,మున్సిపల్ కమిషనర్లు, ఫైర్,రెవెన్యూ,పోలీసు, రెవెన్యూ,తదితరులు పాల్గొన్నారు.
COMMENTS