కోటప్పకొండ పాత కోటయ్య గుడికి ఆరు నెలల్లో మెట్ల దారి ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా వెల్లడించారు.గురువారం సాయంత్ర...
కోటప్పకొండ పాత కోటయ్య గుడికి ఆరు నెలల్లో మెట్ల దారి ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా వెల్లడించారు.గురువారం సాయంత్రం ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతం కోటప్పకొండను జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా సందర్శించారు. త్రికోటేశ్వర స్వామిని దర్శించుకోవడంతో పాటు స్థానిక ఎకో పార్కు, చిల్డ్రన్స్ పార్కు, నాగరవనాలను పరిశీలించారు.రానున్న కార్తీక మాసం, సంక్రాంతి, శివరాత్రి పర్వదినాలను పురస్కరించుకుని కోటప్పకొండకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.
కోటప్పకొండపై ఆధ్యాత్మిక పర్యాటకంతో పాటూ ఎకో టూరిజం, సైట్ సీయింగ్ వంటి ఆహ్లాదక పర్యాటకానికి అవకాశాలున్నాయన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి కృష్ణప్రియ, ఆర్డీవో మధులత, కోటప్పకొండ ఈవో, జిల్లా దేవదాయ శాఖ అధికారి తదితరులు పాల్గొన్నారు.
COMMENTS