ఎడ్లపాడు పోలీసుల విచారణ. ఎడ్లపాడు మండల పరిధిలోని బోయపాలెం నుండి సంఘం గోపాలపురం వెళ్ళే మార్గంలో, సుమారు 30 నుండి 35 సంవత్సరాల మధ...
ఎడ్లపాడు పోలీసుల విచారణ.
ఎడ్లపాడు మండల పరిధిలోని బోయపాలెం నుండి సంఘం గోపాలపురం వెళ్ళే మార్గంలో, సుమారు 30 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన గుర్తు తెలియని పురుషుడు, గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో దుర్మరణం పాలయ్యారు. విషయం తెలుసుకున్న వెంటనే స్పందించి ఎడ్లపాడు ఎస్సై టి శివరామకృష్ణ సిబ్బందితో ఘటనా స్థలాన్ని చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రి కి పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మృతుని వివరాలను తెలుసిన వారు లేదా ఆయన కుటుంబ సభ్యులు/స్నేహితులు ఉంటే, దయచేసి తక్షణమే యడ్లపాడు పోలీస్ స్టేషన్‌ను సంప్రదించగలరు అని తెలిపారు.
సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు:
SI యడ్లపాడు: 94407 96256
CI చిలకలూరిపేట రూరల్: 94407 96268
COMMENTS