నరసరావుపేట: అమరవీరుల సంస్మరణ దినోత్సవం-2025 సందర్భంగా పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు.ఈ...
నరసరావుపేట: అమరవీరుల సంస్మరణ దినోత్సవం-2025 సందర్భంగా పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పోలీసులు విధి నిర్వహణలో ఉపయోగించే సాధనాల ప్రదర్శన ఆకట్టుకుంది.జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ, శాంతి భద్రతల పరిరక్షణ,నేర నియంత్రణ,నేర దర్యాఫ్తులో ఉపయోగించే ఆయుధాలు, సాంకేతిక పరికరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడమే ప్రధాన ఉద్దేశమని అన్నారు.
విద్యార్థులను ఉద్దేశించి ఆయన మహిళలను గౌరవించడం,ట్రాఫిక్ రూల్స్ పాటించడం, హెల్మెట్ తప్పనిసరిగా వాడడం,అవతలి వ్యక్తి స్వేచ్ఛను హరించకూడదని సూచించారు. పోలీస్ జాగిలాల త్యాగం గురించి అవగాహన కలిగించారు.
పాఠశాలల నుండి విచ్చేసిన విద్యార్థులకు ఆయుధాలు, సాంకేతిక పరికరాల ప్రదర్శన, జాగిలాల షో, బ్యాండ్ ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ జె.వి.సంతోష్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ వి.సత్తిరాజు, ఏఆర్ డిఎస్పీ జి.మహాత్మా గాంధీ, ఆర్ఐలు గోపినాథ్, యువరాజ్, కృష్ణ, రాజా తదితర అధికారులు పాల్గొన్నారు.
COMMENTS