తుఫాను ప్రభావంతో ఎడ్లపాడు మండలంలో కురువనున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్‌ఐ టి.శివరామకృష్ణ సూచించారు. క...
తుఫాను ప్రభావంతో ఎడ్లపాడు మండలంలో కురువనున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్‌ఐ టి.శివరామకృష్ణ సూచించారు. కాలువలు, వాగులు పొంగిపొర్లుతున్న కారణంగా ప్రజలు చేపల వేటకు, ఈతకు వెళ్లరాదని ఆయన ఖండితంగా హెచ్చరించారు. ముఖ్యంగా పిల్లలను వాగుల వద్దకు పంపొద్దని, తల్లిదండ్రులు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.అసౌకర్యాలకు గురైన వారు లేదా అత్యవసర పరిస్థితుల్లో టోల్ ఫ్రీ నంబర్లు 100 లేదా 112లకు కాల్ చేసి సమాచారం ఇవ్వవచ్చని ఎస్‌ఐ పేర్కొన్నారు. సంక్షోభ పరిస్థితుల్లో పోలీసు శాఖ అందుబాటులో ఉంటుందని, ప్రజలు సురక్షిత ప్రదేశాల్లో ఉండాలన్నారు. ప్రజలందరూ ఈ సూచనలను గమనించి సహకరించాలని కోరారు.
COMMENTS