పల్నాడు: నవంబర్ మాసం లోపు పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా సంబంధిత అధికా...
పల్నాడు: నవంబర్ మాసం లోపు పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా సంబంధిత అధికారులను ఆదేశించారు.శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ శాఖలో పలు అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నవంబర్ లోపు జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కాలనీలలో తాగునీటి సమస్య రాకుండా యుద్ధ ప్రాతిపదిన నాణ్యమైన పనులు చేపట్టాలని, ఆర్డబ్ల్యూఎస్ అధికారులను, పంచాయతీరాజ్ శాఖ అధికారులను ఆదేశించారు. 15 ఫైనాన్స్ కమిషన్ నిధులు, జడ్పీ నిధుల నుండి నిధులు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలో అన్ని మౌలిక వసతులు పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామాలలో జరిగే పలు అభివృద్ధి పనులు, సంబంధిత హెచ్ ఓ డి లు, జడ్పీ సీఈఓ, డిప్యూటీ సీఈఓ అభివృద్ధి పనులు పరిశీలించాలని ఆదేశించారు. ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ ఈ, సిబ్బంది, కాంట్రాక్టర్ లతో ప్రతిరోజు అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించుకుని పనుల నాణ్యతను పరిశీలించాలన్నారు. ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో జరిగే త్రాగునీటి పైపు లైన్ మరమ్మత్తు పనులు, శానిటేషన్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని తెలిపారు. వివిధ గ్రామాలలో త్రాగునీరు అందించడానికి పంప్ సెట్స్, పైప్ లైన్లు, విద్యుత్ సౌకర్యం, మీటరు మొదలైనవి అమర్చారా లేదా పరిశీలించాలని ఆదేశించారు. పనులకు సంబంధించిన బిల్లులు ఇచ్చేటప్పుడు సంబంధిత డిఈ చెక్ లిస్ట్ తో కూడిన బిల్లులతో జడ్పీ సీఈఓ కి బిల్లులు అందజేయాలని తెలిపారు.
15 వ ఆర్థిక సంఘం, జడ్పీ నిధుల నుంచి బిల్లులకు సంబంధించిన అంశాలపై నిధులు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజనలో భాగంగా గ్రామ ప్రణాళికలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టే పలు అంగనవాడి కేంద్ర భవన నిర్మాణాలు, మరమ్మత్తులు, త్వరితగతిన నిర్మాణం పనులు చేపట్టాలని ఆదేశించారు, 15 ఆర్థిక సంఘం నిధులు ద్వారా జిల్లాలో పి ఆర్ ద్వారా చేపట్టే పనులు నవంబర్ మాసం లోపల పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అనుసంధానం కాని గ్రామాల స్థితిని సమీక్షించి, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ద్వారా డిఎంఎఫ్ గ్రాంట్ కింద గ్రావెల్ ఫార్మేషన్ వరకు పనులను ప్రతిపాదించాలి అని అధికారులను ఆదేశించారు. రోడ్ల పనులకు సంబంధించిన ఫారెస్ట్ క్లియరెన్స్ స్థితిపై సమీక్ష చేసి, వివరాలను సమగ్రంగా సమర్పించాలని సూచించారు.పంచాయతి రాజ్ ఇంజినీరింగ్ ఈ ఈ కె.ముత్తయ్య, పి.ఐ.యు సంపత్ కుమార్, గ్రామీణ నీటి సరఫరా విభాగం జిల్లా అధికారి టి. చంద్ర శేఖర్ మరియు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
COMMENTS