రాష్ట్ర స్థాయిలో అవార్డుకు ఎంపికైన దళిత బహుజన రిసోర్స్ సెంటర్ జిల్లా స్థాయిలో 16 విభాగాల్లో 51 మంది వ్యక్తులు/సంస్థ...
రాష్ట్ర స్థాయిలో అవార్డుకు ఎంపికైన దళిత బహుజన రిసోర్స్ సెంటర్
జిల్లా స్థాయిలో 16 విభాగాల్లో 51 మంది వ్యక్తులు/సంస్థలకు అవార్డులు
కలెక్టర్ కృతిక శుక్లా
నరసరావు పేట: పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ఈ సంధర్భంగా మాట్లాడుతు
పరిశుభ్రత మరియు పారిశుద్ధ్యాన్ని ప్రోత్సహిస్తూ మన రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్ గా మార్చే దిశగా
స్వచ్చాంద్ర కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ ఈరోజు జిల్లా స్థాయి స్వచ్చాంద్ర అవార్డులు-2025 కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ఎంతో గర్వకారణం
అన్నారు.
గత 9 నెలలుగా జిల్లా వ్యాప్తంగా స్వచ్చాంద్ర-స్వర్ణాంద్ర కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించాము.
జిల్లాలో 527 గ్రామ పంచాయతీలు, 6 పట్టణ స్థానిక సంస్థలు (ULBs), 2 నగర పంచాయతీలు ఉన్నాయి.
ULBs లో 93% Door to Door Collection జరుగుతోంది. ఇందులో 42 శాతం చెత్త సేకరణ జరిగిన చోటే Waste segregation కూడా జరుగుతోంది
అన్నారు.
రానున్న రోజుల్లో 100 శాతం ఇంటి వద్దే వేస్ట్ కలెక్షన్, segregation చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం
అన్నారు.
అలాగే పంచాయతీల్లో 50% door to door waste collection, and source వద్దే 20% waste seggreation జరుగుతోంది. ODF+ villages 50% ఉన్నాయి
అన్నారు.
1 ULB లో E-Waste Collection చేస్తున్నాం. డిసెంబర్ నాటికి అన్ని మున్సిపాలిటీల్లో Single Use Plastic ని పూర్తిగా నిషేధించనున్నాం.
అన్నారు.
జిల్లాలో 80% లెగసీ వేస్ట్ ను ఇప్పటికే తొలగించడం జరిగింది. 1,42,000 House Holds కిచెన్ గార్డెనింగ్ చేసేలా ప్రోత్సహిస్తున్నాం
అన్నారు.
జిల్లా వ్యాప్తంగా 466 cleanliness targets Units ని గుర్తించి వాటిని అక్టోబరు 2 నాటికి పూర్తిగా clean చేస్తాం. 2788 పారిశుద్ధ్య కార్మికుల కోసం ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నాం అన్నారు
స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో SERP, MEPMA, విద్యా సంస్థలు, ఆంగన్‌వాడీలు, ఆసుపత్రులు, పర్యాటక ప్రదేశాలను భాగస్వాములను చేశాం అన్నారు
సర్క్యులర్ ఎకానమీ థీమ్‌లో భాగంగా 4 ULBలు వ్యర్థాలను Jindal Waste to Energy Plant కి తరలిస్తున్నాం. అలాగే మున్సిపల్ వ్యర్థాన్ని RDF కోసం సిమెంట్ ఫ్యాక్టరీలకు పంపే ప్రక్రియ కూడా నిర్వహిస్తున్నాం అన్నారు
.
స్వచ్ఛ నగర, మండలాలు, స్వచ్ఛ గ్రామ పంచాయతీలు, స్వచ్ఛ పాఠశాలలు, స్వచ్ఛ ఆసుపత్రులు, స్వచ్ఛ కార్యాలయాలు, స్వచ్ఛ రైతు బజార్లు, స్వచ్ఛ బస్ స్టేషన్లు, స్వచ్ఛ పరిశ్రమలు మొదలైన వివిధ విభాగాలలో అవార్డులకు ఎంపిక చేయడం జరిగింది
అన్నారు.
స్వచ్ఛతా కార్యకలాపాలపై చేసిన ప్రశంశనీయ కృషిని గుర్తించి ప్రభుత్వం అవార్డులను ఏర్పాటు చేసింది.
ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, బహిరంగ ప్రదేశాలలో శుభ్రత, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం, RRR (తగ్గించటం, మళ్లీ ఉపయోగించడం, రీసైకిల్), సుస్థిర పద్ధతులలో కొత్త ప్రమాణాలను నిర్ణయించడం తదితర అంశాలను పరిగణన లోకి తీసుకొని మొత్తం 17 కేటగిరీలలో అవార్డులు ఇవ్వడం జరిగింది అన్నారు.
ఇందులో భాగంగా రాష్ట్ర స్థాయిలో అవార్డుకు ఎంపికైన దళిత బహుజన రిసోర్స్ సెంటర్ కు నా ప్రత్యేక అభినందనలు తేలిపారు.
అలాగే జిల్లా స్థాయిలో 16 విభాగాల్లో 51 మంది వ్యక్తులు/సంస్థలకు అవార్డులు ఈ రోజు ప్రదానం చేసారు..
ఈ అవార్డులు కేవలం ఒక పోటీ మాత్రమే కాదు ఇది పరిశుభ్రత, పారిశుద్ధ్యం పట్ల మన అందరి నిబద్ధతను ప్రతిబింబించే ఒక ప్రజా ఉద్యమం అన్నారు.
ఈ ఉద్యమాన్ని కొనసాగిద్దాం. స్వచ్ఛతలో మనతో మనమే పోటీ పడదాం. స్వచ్ఛ పల్నాడును సాకారం చేద్దాం
అన్నారు.
నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు మాట్లాడుతు
స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డుల పేరుతో కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛతా అవార్డులను ప్రకటిస్తోందని, అదే బాటలో స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు ప్రదానం చేయడం ద్వారా దేశంలోనే మొదటి స్వచ్ఛతా అవార్డులను అందిస్తున్న రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ అవతరించిందని తెలిపారు.
రాష్ట్ర స్థాయిలో ఉత్తమ స్వచ్ఛతా ఎన్జీఓ గా దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఎంపికైంది వెల్లడించారు. జిల్లా స్థాయిలో 16 విభాగాల్లో 51 మంది వ్యక్తులు/సంస్థలు అవార్డులు దక్కించుకున్నాయన్నారు.
ఈ అవార్డులు ఘన మరియు ద్రవ వ్యర్థాల నిర్వహణ, బహిరంగ ప్రదేశాలలో పరిశుభ్రత, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం, RRR (Reduce, Reuse, Recycle), మరియు స్థిరమైన పద్ధతుల ప్రోత్సాహానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రకటించడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమములో పంచాయతీ అధికారులు,మున్సిపల్ కమీషనర్ లు,ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
COMMENTS