చిలకలూరిపేట స్థానిక మోటార్ వెహికల్ కార్యాలయం,జీఎస్టీ విభాగం సంయుక్తంగా నిర్వహించిన "సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్" అవగ...
చిలకలూరిపేట స్థానిక మోటార్ వెహికల్ కార్యాలయం,జీఎస్టీ విభాగం సంయుక్తంగా నిర్వహించిన "సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్" అవగాహన ర్యాలీ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా రఫాని సూపర్ సేవింగ్స్ కరపత్రాలను ఆవిష్కరించారు.రఫాని మాట్లాడుతూ, జీఎస్టీ తగ్గింపుతో ప్రతి కుటుంబానికి నిత్యావసర సరుకుల ధరల్లో సుమారు 7–8 వేల రూపాయల భారం తగ్గుతుందని తెలిపారు.అలాగే ఆటోమొబైల్ రంగంలో పనిచేసే కార్మికులు, డ్రైవర్లు కూడా జీఎస్టీ తగ్గింపుతో పెద్ద మొత్తంలో లాభపడతారని చెప్పారు.ప్రజలు ఈ మార్పులను సద్వినియోగం చేసుకోవాలని, ఆర్థికంగా ముందడుగు వేయాలని ఆయన సూచించారు.
COMMENTS