చిలకలూరిపేట నగరంలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించే లీలావతి హాస్పిటల్‌లో, డాక్టర్ లావు సుష్మ పర్యవేక్షణలో పలు విభాగాల్లో సమ...
చిలకలూరిపేట నగరంలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించే లీలావతి హాస్పిటల్‌లో, డాక్టర్ లావు సుష్మ పర్యవేక్షణలో పలు విభాగాల్లో సమగ్ర చికిత్సా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.సాధారణ మరియు దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సలో జ్వరాలు, మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలకు అన్ని వయసుల వారికి వైద్య సేవలు అందిస్తున్నారు. 8 సంవత్సరాల పిల్లల నుంచి పెద్దవారికి వరకు వివిధ ఆరోగ్య సమస్యలకు నిరంతర వైద్యం అందుబాటులో ఉంది.స్త్రీల ప్రత్యేక సమస్యలు మరియు గర్భధారణ సేవల్లో డాక్టర్ సుష్మ గైనకాలజీ విభాగానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. PCOD, సంతానలేమి, గర్భాశయ గడ్డలు, యూరిన్ ఇన్ఫెక్షన్స్, గర్భసంచి సమస్యలు వంటి చికిత్సలతో పాటు, గర్భిణి కావాలనుకునే వారికి కౌన్సిలింగ్, గర్భిణులకు గర్భధారణ మొత్తం కాలం పూర్తి వైద్య సేవలు, ప్రసవం తర్వాత పాలిచ్చే తల్లులకు అవసరమైన చికిత్సలు అందిస్తున్నారు.జనరల్ సర్జరీ విభాగంలో 24 గంటలు శస్త్రచికిత్సా సేవలు అందుబాటులో ఉన్నాయి. అపెండిక్స్ శస్త్రచికిత్స, గాల్ స్టోన్స్ సమస్యలు, అంబిలికల్ మరియు ఇన్వైనల్ హెర్నియాస్ వంటి శస్త్రచికిత్సలు నిపుణుల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు.దూర ప్రాంతాలు లేదా విదేశాల్లో ఉన్న రోగుల కోసం వీడియో కాల్ ద్వారా ఆరోగ్య సమస్యల పరిష్కారం చేపట్టే సౌకర్యం కూడా కల్పించారు. చిలకలూరిపేట మరియు పరిసర ప్రాంతాల ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని డాక్టర్ లావు సుష్మ విజ్ఞప్తి చేశారు.
COMMENTS