పల్నాడు జిల్లాలో స్వచ్ఛతకై 'అసిస్ట్' (ASSIST) సంస్థ చేస్తున్న కృషికి గుర్తింపుగా, జిల్లా స్థాయి స్వచ్ఛాంధ్ర అవార్డును ఈ ...
పల్నాడు జిల్లాలో స్వచ్ఛతకై 'అసిస్ట్' (ASSIST) సంస్థ చేస్తున్న కృషికి గుర్తింపుగా, జిల్లా స్థాయి స్వచ్ఛాంధ్ర అవార్డును ఈ రోజు సంస్థ అందుకుంది. పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు చేతుల మీదుగా, 'అసిస్ట్' సంస్థ అసోసియేట్ డైరెక్టర్ ఎం. విష్ణుప్రియ ఈ ప్రతిష్టాత్మక అవార్డును నరసరావుపేటలో స్వీకరించారు.
జిల్లాలో పారిశుద్ధ్యం, ప్రజారోగ్యం మరియు స్వచ్ఛత కార్యక్రమాల అమలులో 'అసిస్ట్' సంస్థ విశేష కృషిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. స్వచ్ఛత కోసం సంస్థ చేపట్టిన వినూత్న కార్యక్రమాలు, ప్రజల్లో తీసుకువచ్చిన చైతన్యం ఈ అవార్డుకు ప్రధాన కారణాలుగా నిలిచాయి.కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో, కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ, స్వచ్ఛత లక్ష్యాలను చేరుకోవడంలో స్వచ్ఛంద సంస్థల పాత్ర ఎంతో కీలకమని, 'అసిస్ట్' సంస్థ ఈ దిశగా ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు.
ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు మాట్లాడుతూ, సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న 'అసిస్ట్' సంస్థ కృషి అభినందనీయమని తెలిపారు.ఈ సందర్భంగా అసోసియేట్ డైరెక్టర్ ఎం. విష్ణుప్రియ మాట్లాడుతూ, ఈ అవార్డు సంస్థ సిబ్బంది కృషికి దక్కిన గౌరవంగా భావిస్తున్నామని, భవిష్యత్తులో కూడా పల్నాడు జిల్లా స్వచ్ఛత కోసం తమ సేవలను కొనసాగిస్తామని తెలిపారు.
COMMENTS