పల్నాడు జిల్లా కేంద్రంలో విద్యుత్ శాఖ జిల్లా అధికారి డాక్టర్ ప్రత్తిపాటి విజయ్ కుమార్ సారద్యంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ...
పల్నాడు జిల్లా కేంద్రంలో విద్యుత్ శాఖ జిల్లా అధికారి డాక్టర్ ప్రత్తిపాటి విజయ్ కుమార్ సారద్యంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ మరియు సోలార్ విద్యుత్తు అవగాహన ర్యాలీని స్థానిక విద్యుత్ శాఖ కార్యాలయం ఆవరణ లో పచ్చ జెండా ఊపి ప్రారంభించి పాల్గొన్నారు.ఈ యొక్క ర్యాలీ పట్టణ పురవీధులలో శివుడు బొమ్మ సెంటర్ మీదుగా ప్రధాన రహదారి లో ఉన్నఅంబేద్కర్ సెంటర్ వరకు అక్కడ నుండి పాండురంగ స్వామి దేవాలయం మీదుగా కోట సెంటర్ నుండి విద్యుత్ శాఖ కార్యాలయం వరకు విద్యుత్ శాఖ సిబ్బందితో ప్లకార్డ్స్ పట్టుకొని అవగాహన ర్యాలీని నిర్వహించడం జరిగింది. దారి పొడవునా కరపత్రాలు కూడా పంచడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా విద్యుత్ శాఖ అధికారి మాట్లాడుతూ భారత ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన సూపర్ సేవింగ్స్ సూపర్ జిఎస్టి వల్ల విద్యుత్ గృహ ఉపకరణాలు రేట్లు తగ్గినాయని అదేవిధంగా సోలార్ విద్యుత్తు పెట్టుకుంటానికి ముందుకు వచ్చే వారికి జీఎస్టీ రేటు తగ్గడం వలన వారికి లాభం కలుగుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాంబోట్లు మాట్లాడుతూ విద్యుత్ రంగ సంస్థలో గృహ వినియోగదారులకు అదనపులోడు ఉంటే 50 శాతం రాయితీ ద్వారా లోడు క్రమబద్ధీకరణ పథకం ఉన్నదని దీనిని ప్రతి ఒక్క గృహ వినియోదారుడు వినియోగించుకోవాలని కోరారు ఈ అవగాహన ర్యాలీలో సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రసాద్ అసిస్టెంట్ ఇంజనీర్లు రఫీ సురేంద్ర బాబు, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్లు సాంబశివరావు,మౌళి, ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.
COMMENTS