చిలకలూరిపేట పురపాలక సంఘంలో పట్టణ ప్రణాళిక, ఆక్రమణలు, అనధికార నిర్మాణాలపై మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరి బాబు సమీక్ష నిర్వహించారు....
చిలకలూరిపేట పురపాలక సంఘంలో పట్టణ ప్రణాళిక, ఆక్రమణలు, అనధికార నిర్మాణాలపై మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరి బాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టణంలో ఎల్.ఆర్.ఎస్. (లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) పథకాన్ని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.పట్టణంలో ఉన్న ఆక్రమణలు మరియు అనధికార నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, వాటిని తక్షణమే తొలగించాలని కమిషనర్ సూచించారు.
పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా, రోడ్లు మార్కింగ్ బోర్డులను వెంటనే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరి బాబు మాట్లాడుతూ, "టౌన్ ప్లానింగ్ విభాగానికి చెందిన ఉద్యోగస్తులు ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము. పట్టణ ప్రణాళికకు సంబంధించిన పనులను త్వరతిగతిన పూర్తి చేయాలి," అని హెచ్చరించారు.
పట్టణ అభివృద్ధిలో టౌన్ ప్లానింగ్ విభాగం కీలక పాత్ర పోషిస్తుందని, పనులు ఆలస్యం కాకుండా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉద్యోగులందరిపై ఉందని కమిషనర్ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ టిపిఎస్, టిపిబివో, లారెన్స్ సెక్రటరీలో తదితరులు ఉన్నారు.
COMMENTS