నరసరావు పేట: పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా బొల్లాపల్లి మండలంలో విస్తృత పర్యటన చేపట్టారు. ఉపాధి హామీ పథకం కింద ఏర్పాటు చే...
నరసరావు పేట: పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా బొల్లాపల్లి మండలంలో విస్తృత పర్యటన చేపట్టారు.
ఉపాధి హామీ పథకం కింద ఏర్పాటు చేసిన కొబ్బరి తోట, ఫారం పాండ్లు వంటి పనులను పరిశీలించారు. రైతులు తోటలో అపరాలు, కూరగాయలు వంటి అంతర పంటలు సాగు చేసి అదనపు ఆదాయం పొందాలన్నారు. ఫారం పాండ్ వద్ద కొబ్బరి మొక్కను నాటి, ఉపాధి కూలీల పనులలో పాలు పంచుకున్నారు.
స్థానికంగా ఉన్న మైక్రో ఇరిగేషన్ ట్యాంకును అభివృద్ధి చేసి మరో 1000 ఎకరాలు అదనంగా సాగులోకి తీసుకురావాలన్నారు.
సచివాలయం వద్ద ఇంకుడుగుంత, వర్మీ కంపోస్ట్ తయారీని పరిశీలించారు. గ్రామ సభ నిర్వహించి అర్జీలు స్వీకరించారు. క్షేత్ర స్థాయి సిబ్బంది గ్రామంలోని సమస్యలపై అవగాహన కలిగి ఉండటమే గాక సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు.బొల్లాపల్లి మండలంలో ఉద్యాన పంటలకు ఉన్న అవకాశాలను అందించుకోవాలన్నారు.
COMMENTS