డీఎస్సీ 2025 అభ్యర్థుల శిక్షణా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా నరసరావు పేట: తమ విద్యార్థుల ఉత్తీర్ణతే ఉపాధ్యాయుల విజయా...
డీఎస్సీ 2025 అభ్యర్థుల శిక్షణా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా
నరసరావు పేట: తమ విద్యార్థుల ఉత్తీర్ణతే ఉపాధ్యాయుల విజయానికి కొలమానమని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అన్నారు.
వినుకొండ మండలంలోని వివేకానంద డీఎడ్ కాలేజ్ లో మెగా డీఎస్సీ - 2025 లో ఎంపికైన నూతన ఉపాధ్యాయులకు నిర్వహించిన 8 రోజుల శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరై నూతన ఉపాధ్యాయులకు సూచనలు చేశారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే పిల్లల నేపథ్యాన్ని గుర్తించి పాఠాలు బోధించాల్సిన అవసరం ఉంటుందన్నారు. పేదల పిల్లలు ఇంటి పనుల్లో తల్లిదండ్రులకు సాయం చేస్తూ చదువుకునే పిల్లలకు కార్పొరేట్ పాఠశాలల్లో పిల్లలకు తేడాలుంటాయన్నారు.
విద్యార్థులను ప్రతిభ ఆధారంగా తరగతులుగా విభజించి వివిధ రకాల బోధనా పద్ధతులను అవలంబించడం ద్వారా అందరినీ ఉత్తీర్ణులను చేయాలన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు బోధనేతర విధులు తగ్గించడం జరిగిందని, ఈ సౌలభ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఈ సమావేశంలో డి.వో.ఓ చంద్రకళ, ఆ.ర్డి.ఓ రమణా కాంత్ రెడ్డి,ఎం.ఈ.ఓ సయ్యద్ జఫ్రూల్లా, 182 మంది నూతన ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
COMMENTS