ఎడ్లపాడు మండల పరిధిలోని తిమ్మాపురం జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం పోలీసులు భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఎడ...
ఎడ్లపాడు మండల పరిధిలోని తిమ్మాపురం జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం పోలీసులు భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఎడ్లపాడు పోలీస్ స్టేషన్ ఎస్సై టి.శివరామకృష్ణ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ తనిఖీలలో పలువురు వాహనదారులపై మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారు లేదో తనిఖీ చేశారు.తనిఖీల సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ, ప్రజల ప్రాణభద్రతను కాపాడటమే తమ ప్రధాన లక్ష్యమని, మద్యం సేవించి వాహనం నడపడం ద్వారా ప్రమాదాలను ఆహ్వానించవద్దని హెచ్చరించారు.డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో చట్టపరమైన చర్యలు కఠినంగా తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.వాహనదారులు ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని, కుటుంబ సభ్యుల భద్రత కోసం బాధ్యతతో వ్యవహరించాలని ఎస్సై శివరామకృష్ణ సూచించారు.ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
COMMENTS