సీఐ రమేష్ ఆధ్వర్యంలో ఘన నివాళి. చిలకలూరిపేట అర్బన్ జాతిపిత మహాత్మా గాంధీ 156వ జయంతిని పురస్కరించుకుని చిలకలూరిపేట పట్టణంలో పోలీస...
సీఐ రమేష్ ఆధ్వర్యంలో ఘన నివాళి.
చిలకలూరిపేట అర్బన్ జాతిపిత మహాత్మా గాంధీ 156వ జయంతిని పురస్కరించుకుని చిలకలూరిపేట పట్టణంలో పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా అర్బన్ సీఐ రమేష్ , ఆయన కార్యాలయ సిబ్బందితో కలిసి గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. భారత స్వాతంత్ర్యం కోసం గాంధీజీ చేసిన కృషి, అహింసా సిద్ధాంతం ఆవశ్యకతను ఈ సందర్భంగా సీఐ రమేష్ గుర్తు చేసుకున్నారు.పోలీస్ సిబ్బందికి, ప్రజలకు గాంధీజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని, శాంతియుతంగా, నిజాయితీగా విధులు నిర్వర్తించాలని, సమాజానికి సేవ చేయాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలువురు ఎస్.ఐ.లు , సిబ్బంది పాల్గొన్నారు.
COMMENTS