చిలకలూరిపేట: పల్నాడు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలలో ఘన, ద్రవ వ్యర్థాల సక్రమ నిర్వహణపై అవగాహన కల్పించేందుకు ఉద్దేశించిన ఐఈసీ (...
చిలకలూరిపేట: పల్నాడు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలలో ఘన, ద్రవ వ్యర్థాల సక్రమ నిర్వహణపై అవగాహన కల్పించేందుకు ఉద్దేశించిన ఐఈసీ (Information, Education, and Communication) పోస్టర్లను నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు (ఎంపీ) శ్రీ లావు కృష్ణదేవరాయలు చిలకలూరిపేటలోని అసిస్ట్ సంస్థ ప్రధాన కార్యాలయం నందు ఘనంగా ఆవిష్కరించారు.అసిస్ట్ సంస్థ మరియు ఐటీసీ (ITC) సంస్థ సంయుక్తంగా పల్నాడు జిల్లా వ్యాప్తంగా జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలకు వ్యర్థాల సక్రమ నిర్వహణపై అవగాహన, శిక్షణలు కల్పిస్తూ చేస్తున్న కృషిని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు స్వచ్ఛత సాధనలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతోనే 'స్వచ్ఛ పల్నాడు' లక్ష్యాన్ని సాధించవచ్చని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అసిస్ట్ సంస్థ అధినేత డా. జె. రంగారావు, అసోసియేట్ డైరెక్టర్లు జె. కృష్ణ హరీష్, ఎం. విష్ణుప్రియ, కోఆర్డినేటర్లు రత్నకుమార్, శ్రీనివాస్ తో పాటు అసిస్ట్ సిబ్బంది పాల్గొన్నారు.
COMMENTS