చిలకలూరిపేట పట్టణంలోని సుగాలి కాలనీ జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ఏర్పాటైన పునరావాస కేంద్రాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా...
చిలకలూరిపేట పట్టణంలోని సుగాలి కాలనీ జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ఏర్పాటైన పునరావాస కేంద్రాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా పరిశీలించారు. కేంద్రంలో తాత్కాలికంగా ఆశ్రయం పొందిన వారికి అందిస్తున్న సౌకర్యాలపై ఆమె వివరాలు,మౌలిక వసతులు, శానిటేషన్, తాగునీటి సరఫరా, విద్యుత్ వంటి అంశాల్లో అధికారులు చేపడుతున్న చర్యలను పరిశీలించి,మరిన్ని తోడ్పాట్లు అందించాలంటూ ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ కేంద్రంలో ఉన్న పిల్లలకు బిస్కెట్లు ప్యాకెట్లు పంపిణీ చేశారు. ప్రజల అవసరాలను అడిగి తెలుసుకున్నారు.ఈకార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరిబాబు,డి.ఈ రహీం, పలువురు అధికారులు పాల్గొన్నారు.
COMMENTS