చిలకలూరిపేట పురపాలకసంఘ పరిధిలో కురుస్తున్న భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకొని తక్షణ సహాయక చర్యల కోసం మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక...
చిలకలూరిపేట పురపాలకసంఘ పరిధిలో కురుస్తున్న భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకొని తక్షణ సహాయక చర్యల కోసం మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబడినట్లు మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరిబాబు తెలిపారు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాల కారణంగా చెట్లు కూలిపోవడం, భవనాలు పడిపోవడం లేదా ఇళ్లలోకి నీరు చేరడం వంటి పరిస్థితులు ఏర్పడినట్లయితే వెంటనే కంట్రోల్ రూమ్ టెలిఫోన్ నంబర్ 08647-253994 కు సమాచారం అందించవలసిందిగా ఆయన సూచించారు.మున్సిపల్ సిబ్బంది అప్రమత్తంగా ఉండి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు కమిషనర్ తెలిపారు.
COMMENTS