చిలకలూరిపేటలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో మరియ ఏ.ఎం.జి వెనక ప్రాంతంలో పారిశుధ్య పనులను మున్సిపల్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ సి. హెచ్. ర...
చిలకలూరిపేటలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో మరియ ఏ.ఎం.జి వెనక ప్రాంతంలో పారిశుధ్య పనులను మున్సిపల్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ సి. హెచ్. రమణారావు మంగళవారం పర్యవేక్షించారు. బస్టాండ్ పరిసరాల్లో పిచ్చి మొక్కల తొలగింపు,చెత్త శుభ్రపరిచే చర్యలను ప్రైవేట్ ట్రాక్టర్లు, జెసిబి సహాయంతో చేపట్టారు.
సి. హెచ్. రమణారావు మాట్లాడుతూ, ఇటీవలి భారీ వర్షాల కారణంగా బస్టాండ్ ఆవరణలోని గుంతల్లో వర్షపు నీరు నిల్వ ఉండి దుర్వాసనతో పాటు పిచ్చి చెట్లు పుష్కలంగా పెరిగి విషకీటకాలు, దోమలు పెరుగుతున్నందున ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతోందని తెలిపారు.ప్రజా ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా మున్సిపల్ కమిషనర్ పీ. శ్రీహరిబాబు ఆదేశాల మేరకు పిచ్చి మొక్కల తొలగింపు, చెత్త శుభ్రపరిచి పారిశుధ్య పరిస్థితులను మెరుగుపరుస్తున్నట్లు చెప్పారు.అలాగే వర్షపు నీరు గుంతల్లో నిల్వ ఉండకుండా గుంతలను డస్ట్‌తో నింపుతున్న చర్యలు కూడా చేపట్టినట్లు ఇన్‌స్పెక్టర్ వివరించారు.
COMMENTS