నరసరావుపేట: ప్రజల శాంతి భద్రతల పరిరక్షణలో తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన పోలీసు అమరవీరులకు నివాళులు అర్పించాల్సిన బాధ్యత ప్రతీ ...
నరసరావుపేట: ప్రజల శాంతి భద్రతల పరిరక్షణలో తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన పోలీసు అమరవీరులకు నివాళులు అర్పించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా కలెక్టరేట్ పరేడ్ గ్రౌండ్స్ లో మంగళవారం జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ,జిల్లా ఎస్పీ కృష్ణారావు , పోలీసు అధికారులు అమర వీరులు స్తూపాము వద్ద అంకితభావంతో సేవలందిస్తూ ప్రాణాలర్పించిన త్యాగధనులందరినీ పేరుపెరునా తలచి, వారి త్యాగాలను మననం చేసుకుంటూ వారికి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల మాట్లాడుతూ ఇది కేవలం ఒక కార్యక్రమం కాదు, మన సమాజం కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు వీరులను స్మరించుకుంటూ వారిని గౌరవించే పవిత్రమైన రోజు. చైనాముష్కరుల చేతిలో అసువులు బాసిన సీఆర్పీఎఫ్ బలగాల త్యాగాలను గుర్తుంచుకుంటూ కేంద్ర ప్రభుత్వం జాతీయ పోలిస్ అమరవీరుల సంస్మరణ దినం నిర్వహిస్తోంది అని అన్నారు.విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల త్యాగాలను స్మరించుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం అన్నారు, అసువులు బాసిన పోలీసు సిబ్బంది కుటుంబాలను ఆన్ని విధాలా ఆదుకుంటాం అని తెలిపారు .
21 అక్టోబర్ 1959 న భారత సైన్యం లఢక్ లోని హాట్ స్ప్రింగ్ అనే ప్రాంతంలో చైనా దురాక్రమణను కరమ్ సింగ్, డీఎస్పీ. నాయకత్వంలో సైనికులు సమర్థవంతంగా తిప్పికోట్టిన రోజు ఇది. ఈ సమరంలో కరమ్ సింగ్ తో పాటు 10 మంది పోలీసు వీరులు అమరులయ్యారు. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ యోధుల త్యాగాలను స్మరించుకుంటూ, అక్టోబర్ 21 తేదిన అమర వీరుల సంస్మరణ దినంగా జరుపుకుంటున్నాం అని అన్నారు .
ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా ఎంతో మంది సైనికులు మరియు పోలీసులు సంఘ విద్రోహ శక్తులను ఎదుర్కొనే క్రమంలో ప్రాణ త్యాగం చేస్తున్నారు. వీరమరణం పొందిన పోలీసు వారి యొక్క కుటుంబ సభ్యులను ప్రతి సంవత్సరం పిలిచి వారిని సన్మానించుకుని, వారికి ఉన్న సమస్యలను తెలుసుకొని వాటిని తీర్చడానికి కృషి చేస్తున్నాం అని అన్నారు .
సరిహద్దుల్లో సైనికులు మరియు దేశంలోనీ పోలీసు వారు నిరంతర కృషి వలననే ప్రజలు నిరంతరం ప్రశాంతంగా ఉంటున్నారు. ఆ విధంగా పోలీసు వారు ప్రజలకు అండగా ఉంటూ కొన్ని దురదృష్టకర సంఘటనలో సంఘ విద్రోహ శక్తులను అణచే క్రమంలో అసువులు బాసి వీరమరణం పొందారు.వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నామ.వారి ప్రాణత్యాగం వెలకట్టలేనిది. వారి త్యాగస్ఫూర్తి భావితరాలకు ఆదర్శం అని అన్నారు
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు మాట్లాడుతూ. సమాజానికి పోలీసు వారు చేసే సేవలు అనిర్వచనం. పోలీస్ వ్యవస్థ లేని సమాజాన్ని మనం ఊహించలేం. పోలీసు వ్యవస్థ లేకపోతే సమాజంలో సంఘవిద్రోహ శక్తుల ఆగడాలకు అడ్డువుండదు. దేశ సరిహద్దుల్లో సైనికులు, దేశంలో పోలీసులు నిత్యం పహారాకాస్తు ప్రజల ధన మాన ప్రాణాలను రక్షిస్తున్నారు. ఈ క్రమంలో ఎంతోమంది పోలీస్ వారు సంఘవిద్రోహ శక్తులను అణచివేసే క్రమంలో తమ ప్రాణాలను అర్పించి అసువులు బాసినారు. వారి ప్రాణత్యాగం వెలకట్టలేనిది.ఈ సందర్భంగా సమాజ హితం కోసం ప్రాణ త్యాగం చేసిన ఆ మహావీరుల త్యాగాన్ని స్మరించుకోవడం మనకు ఎంతో గర్వకారణం వారి యొక్క స్ఫూర్తిని ముందుకు కొనసాగిస్తూ పోలీస్ శాఖ ప్రజలకు సమాజానికి మరిన్ని సేవలనుఅందిస్తుందని ఈ సందర్భంగా కోరుకుంటున్నానని తెలిపారు.
నరసరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ. సరిహద్దుల్లో సైనికులు మరియు దేశంలోనీ పోలీసు వారు నిరంతర కృషి వలననే ప్రజలు నిరంతరం ప్రశాంతంగా ఉంటున్నారు.
ఆ విధంగా పోలీసు వారు ప్రజలకు అండగా ఉంటూ కొన్ని దురదృష్టకర సంఘటనలలో సంఘవిద్రోహ శక్తులను అణచే క్రమంలో అసువులు బాసి వీరమరణం పొందారు అన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాను.వారి ప్రాణత్యాగం వెలకట్టలేనిది. వారి త్యాగస్ఫూర్తి భావితరాలకు ఆదర్శం అని కొనియాడారు.
జిల్లా వ్యాప్తంగా వీర మరణం పొందిన ఒక ఎస్ఐ మరియు 8 మంది పోలీస్ సిబ్బంది యొక్క కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించి, వారికి పల్నాడు జిల్లా పోలీస్ శాఖ తరపున ఎస్పీ మరియు కలెక్టర్ జ్ఞాపికలు అందజేశారు
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ జె.వి.సంతోష్ (పరిపాలన విభాగం),ఏ.ఆర్ అడిషనల్ ఎస్పీ వి.సత్తి రాజు,సత్తెనపల్లి డీఎస్పీ యం.హనుమంతు రావు, మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పి వెంకట్రావు , సిఐలు,ఆర్ఐలు,ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
COMMENTS