గుంటూరులో ఆత్మీయ అభినందన సభ కార్యక్రమంలో పాల్గొన్న శుభాకాంక్షలు తెలిపిన: రాష్ట్ర ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు అడపా మోహన్ మాదిగ.. గుంట...
గుంటూరులో ఆత్మీయ అభినందన సభ
కార్యక్రమంలో పాల్గొన్న శుభాకాంక్షలు తెలిపిన: రాష్ట్ర ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు అడపా మోహన్ మాదిగ..
గుంటూరు:సామాజిక న్యాయపథంలో నిబద్ధతతో అంచలంచెలుగా సేవలు అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమీషన్ చైర్మన్ కొత్తపల్లి శామ్యూల్ జవహర్‌ను గుంటూరు పట్టణంలో ఆయన మిత్రమండలి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. గుంటూరు మెడికల్ కాలేజి ఎదురుగా ఉన్న ఏపీఎన్జీజీవోస్ (APNGGO's) రిక్రియేషన్ హాల్‌లో ఆదివారం నాడు ఆత్మీయ అభినందన సభ జరిగింది.ఈ కార్యక్రమానికి పలువురు నాయకులు, అభిమానులు హాజరై చైర్మన్ జవహర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు అడపా మోహన్ మాదిగ మర్యాదపూర్వకంగా చైర్మన్‌ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా అడపా మోహన్ మాదిగ మాట్లాడుతూ, సామాజిక న్యాయం, దళితుల హక్కుల పరిరక్షణ దిశగా కొత్తపల్లి శామ్యూల్ జవహర్ అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. "దళిత వర్గాల సమస్యల పరిష్కారానికి, వారి అభ్యున్నతికి ఎస్సీ కమిషన్ చైర్మన్ కృషి చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఆయన మరింతగా దళిత జాతికి సేవ చేయాలని ఆకాంక్షించారు."సభకు హాజరైన ఇతర నాయకులు, ప్రముఖులు కూడా చైర్మన్ జవహర్ సేవలను కొనియాడారు. కొత్తపల్లి శామ్యూల్ జవహర్ మాట్లాడుతూ, దళితుల హక్కులు, సంక్షేమం కోసం కమిషన్ చిత్తశుద్ధితో పనిచేస్తుందని, సామాజిక న్యాయం కోసం తన పోరాటం కొనసాగిస్తానని హామీ ఇచ్చారు.
COMMENTS