పబ్లిక్ ప్రవేట్ పార్టనర్ షిప్ ద్వారా మెడికల్ కళాశాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ ర...
పబ్లిక్ ప్రవేట్ పార్టనర్ షిప్ ద్వారా మెడికల్ కళాశాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్యుల విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ముప్పాళ్ళ.హనుమంతరావు అన్నారు.గురువారం పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రం త్వరిత గతిన అభివృద్ధి చెందేందుకు ఈ విధానం సరియైనదని డా.ముప్పాళ్ళ అన్నారు.దీనిపై ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయని,అవన్నీ తొలిగించుకోవాలని ఆయన సూచించారు.
మెడికల్ కళాశాలలను ట్రిపుల్ పీ పద్ధతిలో అభివృద్ధి చేస్తే పేదలకు కార్పొరేట్ వైద్యం చౌకగా లభిస్తుందని, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు.ప్రభుత్వ నిబంధనలకు లోబడి మాత్రమే ఈ వైద్య శాలలు నడుస్తాయి కాబట్టి పేదలకు ఇప్పుడున్న సౌకర్యాలన్నీ ఉంటాయన్నారు. ఇంకా మెరుగైన సౌకర్యాలు కూడా కల్పించబడతాయన్నారు.సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో ముందు చూపుతో ఈ పద్ధతి సృష్టించారన్నారు.గడువు పూర్తయిన తర్వాత ఆ ఆస్తులన్నీ ప్రభుత్వ పరమవుతాయి కాబట్టి ప్రభుత్వానికి మేలు జరుగుతుందన్నారు. వైద్య శాలల్లో సీట్లు భర్తీ ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉంటుంది కాబట్టి ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగదన్నారు. దీనిపై ప్రతిపక్షాలు చెబుతున్నవన్ని అవాస్తవాలని, ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలని డా.ముప్పాళ్ళ కోరారు.
COMMENTS