జగన్..వైసీపీ రాక్షసమూక ఎన్ని కుట్రలు చేసినా... చంద్రబాబు తలపెట్టిన అభివృద్ధి, సంక్షేమ మహాయజ్ఞం ఆగదు. “ తన హాయాంలో రాష్ట్రంలో కల్...
జగన్..వైసీపీ రాక్షసమూక ఎన్ని కుట్రలు చేసినా... చంద్రబాబు తలపెట్టిన అభివృద్ధి, సంక్షేమ మహాయజ్ఞం ఆగదు.
“ తన హాయాంలో రాష్ట్రంలో కల్తీ, విషపూరిత మద్యాన్ని ఏరులై పారించి, అమాయకుల చావులకు కారణమైన జగన్.. మరో పక్క తన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికే మెడికల్ కాలేజీల నిర్మాణంపై విషప్రచారం చేస్తున్నాడు. ఐదేళ్లు తాను చేసిన దుర్మార్గాలు, పాపాలపై ఆత్మపరిశీలన చేసుకొని, ప్రజల్ని బహిరంగ క్షమాపణ కోరాకే జగన్ మనసు మెరుగై, ప్రభుత్వం ప్రజలక్షేమం తీసుకునే నిర్ణయాలు అవగతమవుతాయి. అహంకారపు పోకడలతో పరిశీలనలు.. పరామర్శలు అంటూ ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో ఆందోళనలు రేపాలనే దుర్బుధ్దితో వ్యవరిస్తానంటే పాలకులు చూస్తూ ఊరుకోరు. పోలీసుల ఆంక్షల్ని బేఖాతరు చేస్తూ పర్యటనలపేరుతో ప్రజాజీవనానికి భంగం కలిగించే చర్యలకు పాల్పడితే ప్రభుత్వం ఉపేక్షించదు. ఈ నిజాన్ని జగన్ గుర్తించాలి. తన హాయాంలో సామాన్యప్రజల్ని నోరెత్తనీయకుండా భయపెట్టిన జగన్.. నేడు అక్రమ అరెస్టులు.. ఆంక్షలు..కక్షసాధింపులని గగ్గోలు పెట్టడం విచిత్రంగా ఉంది. మెడికల్ కాలేజీల నిర్మాణానికి కేంద్రమిచ్చిన నిధుల్ని దుర్వినియోగం చేసిన జగన్.... ఏ ముఖంపెట్టుకొని నిర్మాణాల పరిశీలనకు వెళ్తున్నాడో, నర్సీపట్నం వైద్యకళాశాల ఎంతమేర నిర్మించాడో ప్రజలకు సమాధానం చెప్పాలి. పీపీపీ విధానానికి, ప్రైవేటీకరణకు తేడా తెలుసుకోకుండా, వ్యక్తిగత ప్రయోజానాల కోసం ప్రభుత్వంపై నిందలేసే సంకుచిత రాజకీయాలు జగన్ మానుకోవాలి. ప్రైవేట్ సంస్థలకు ఎలాంటి భూకేటాయింపులు లేకుండా కేవలం వాటిని నిర్మాణానికే పరిమితం చేసినా.. కన్వీనర్ కోటా వైద్యసీట్లు పెరుగుతున్నా జగన్ ఆరోపణలు చేయడం వ్యక్తిగత ప్రయోజనం కాక ఏమనుకోవాలి? పీపీపీ విధాన నిర్ణయాలు జగన్ కు బోధపడాలంటే ఆయన తక్షణమే దోపిడీ పాలసీలు.. క్విడ్ ప్రోకో.. మనీ లాండరింగ్.. షెల్ కంపెనీల ఏర్పాటు ఆలోచనల నుంచి బయటకు రావాలి.
*వాస్తవాలు.. ప్రజలకు కలిగే మేలు కన్నా.. జగన్ కు వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యం.*
కేవలం తక్కువ కాలంలో వైద్య కళాశాలల నిర్మాణాలు త్వరితగతిన పూర్తై, ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందుబాటులోకి వచ్చేలా, 33 ఏళ్ల తర్వాత పూర్తిగా ప్రభుత్వ అధీనంలోకి వచ్చేలా ఉన్న నిబంధనల్ని జగన్ తప్పుపట్టడం హాస్యాస్పదం. వాస్తవాలు.. ఫలితాలతో పనిలేకుండా కేవలం వ్యక్తిగత ప్రయోజనాలే అజెండాగా జగన్ ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపడుతున్నాడనేది వాస్తవం. చంద్రబాబు నాయకత్వంలో ఏడాదిన్నరలోనే రాష్ట్రం అభివృద్ధి.. సంక్షేమంలో పరుగులు పెట్టడం చూసి సహించలేకే జగన్.. నీచమైన ఆలోచనలతో కూటమిప్రభుత్వంపై విషం చిమ్ముతున్నాడని ప్రజలు గ్రహించారు. ఇప్పటికీ ప్రభుత్వం ఎదుర్కొంటున్న సమస్యలు.. తాము పడుతున్న కష్టాలకు జగన్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే కారణమని ప్రజలకు బోధపడినా, వాస్తవాలు గ్రహించలేని దుస్థితిలో వైసీపీ నాయకత్వం ఉంది. జగన్..వైసీపీ రాక్షసమూక ఎన్ని కుట్రలు చేసినా... చంద్రబాబు తలపెట్టిన అభివృద్ధి, సంక్షేయ యజ్ఞం ఆగదు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్..ఐటీ సంస్థ రైడెన్.. ఏఐ సాంకేతికతలో మైక్రోసాఫ్ట్ సహకారం... క్వాంటమ్ వ్యాలీ సహా రూ.10 లక్షల కోట్ల పెట్టుబడుల ఆకర్షణే అందుకు సజీవ సాక్ష్యం. తన దుర్మార్గాలు, పాపాలపై ఆత్మపరిశీలన చేసుకొని, ప్రజల్ని క్షమాపణ కోరకుండా జగన్ చేపట్టే కార్యక్రమాలన్నీ అభాసుపాలే. తాను ప్రవేశపెట్టిన డిజిటల్ బుక్ లో వైసీపీనేతల దుర్మార్గాలు నమోదు కావడమే అందుకు రుజువు. క్రిమినల్ పాలిటిక్స్ .. ఫేక్ ప్రచారంతో మనుగడ సాధ్యంకాదని.. ప్రజాదరణ పొందలేననే నిజాన్ని జగన్ ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది.” అని మాజీమంత్రి ప్రత్తిపాటి ఒక ప్రకటనలో హితవుపలికారు.
COMMENTS