ఎడ్లపాడు మండల పరిధిలోని ఎడ్లపాడు నుండి నాదెండ్లకు వెళ్లే దారిలో బ్రిడ్జి పక్కన ఉన్న సుబాబుల్ కొట్టడానికి వచ్చిన ఐదు కుటుంబాల పర...
ఎడ్లపాడు మండల పరిధిలోని ఎడ్లపాడు నుండి నాదెండ్లకు వెళ్లే దారిలో బ్రిడ్జి పక్కన ఉన్న సుబాబుల్ కొట్టడానికి వచ్చిన ఐదు కుటుంబాల పరిస్థితిని ఎస్సై టీ. శివరామకృష్ణ పరిశీలించారు. తుఫాను ప్రభావంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో ప్రమాదం సంభవించే అవకాశం ఉండటంతో ఆయన తక్షణ చర్యలు తీసుకున్నారు. వీఆర్వో జగన్ మోహన్ రావు ఆధ్వర్యంలో ఆ కుటుంబాలకు భోజన సదుపాయం కల్పించి, వారిని సురక్షిత ప్రాంతమైన నాదెండ్ల హై స్కూల్‌కు తరలించారు.
COMMENTS