చిలకలూరిపేట: నరసరావుపేట ఇన్ఛార్జి డిఎస్పీ మేదరమెట్ల హనుమంతరావు సోమవారం నాడు చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీల...
చిలకలూరిపేట: నరసరావుపేట ఇన్ఛార్జి డిఎస్పీ మేదరమెట్ల హనుమంతరావు సోమవారం నాడు చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీలో భాగంగా సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్‌కు చేరుకున్న డిఎస్పీ కి పట్టణ సిఐ పి. రమేష్ , ఎస్సైలు షేక్. రహమతుల్లా, పి. హాజరతయ్య లు ఘన స్వాగతం పలికారు.ఈ తనిఖీలో భాగంగా డిఎస్పీ హనుమంతరావు పోలీస్ స్టేషన్ పరిసరాలను, కార్యాలయ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. రికార్డుల నిర్వహణ మరియు స్టేషన్ పరిసరాల పరిశుభ్రత పట్ల ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు.అనంతరం, డిఎస్పీ పోలీస్ స్టేషన్ సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిబ్బందికి వారు నిర్వర్తించాల్సిన విధులలో మరింత మెరుగైన పనితీరు కనబరచడానికి అవసరమైన తగు సలహాలు, సూచనలు చేశారు.ఈ తనిఖీ కార్యక్రమంలో పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
COMMENTS