యడ్లపాడు గ్రామంలో ఈరోజు ప్రత్యేకంగా నిర్వహించిన జీఎస్టీ అవగాహన కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా స్వయంగా పాల్గొన...
యడ్లపాడు గ్రామంలో ఈరోజు ప్రత్యేకంగా నిర్వహించిన జీఎస్టీ అవగాహన కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా స్వయంగా పాల్గొని ప్రజలతో మమేకమయ్యారు. ప్రజల ఇంటింటికి వెళ్లి జీఎస్టీ కరపత్రాలను పంపిణీ చేసి, "సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్" వల్ల కలిగే లాభాలను వివరించారు.కలెక్టర్ మాట్లాడుతూ.. వస్తువుల ధరల తగ్గింపుతో సాధారణ కుటుంబాలు గణనీయమైన ఆదా చేసుకోవచ్చని పేర్కొన్నారు.పండగ కాలంలో ఈ సేవింగ్స్ మరింత ఉపయోగపడతాయని అన్నారు. జీఎస్టీ విధానం వల్ల పారదర్శకమైన వ్యాపార లావాదేవీలు జరుగుతాయని, వినియోగదారుల హక్కులు రక్షితమవుతాయని ఆమె స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
COMMENTS