చిలకలూరిపేట:పల్నాడు జిల్లాలోని సురక్షితమైన త్రాగునీటి లభ్యత లేని మారుమూల గ్రామాల ప్రజలకు శుభవార్త. చిలకలూరిపేట కేంద్రంగా పనిచేస్...
చిలకలూరిపేట:పల్నాడు జిల్లాలోని సురక్షితమైన త్రాగునీటి లభ్యత లేని మారుమూల గ్రామాల ప్రజలకు శుభవార్త. చిలకలూరిపేట కేంద్రంగా పనిచేస్తున్న అసిస్ట్ సంస్థ, ఓఎన్జీసీ కంపెనీ సహకారంతో ఒక్కొక్కటి రూ. 10 లక్షల విలువైన ఏడు మంచినీటి శుద్ధి ప్లాంట్లను ఉచితంగా ఏర్పాటు చేసింది. చిలకలూరిపేటలోని టిడ్కో గృహాల సముదాయంలో ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు కృష్ణదేవరాయలు, చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, మరియు ఓఎన్జీసీ రాజమండ్రి జనరల్ మేనేజర్ & సీఎస్ఆర్ హెడ్ రూనా మజుందార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ప్రారంభంముఖ్య అతిథులు మాట్లాడుతూ, స్వచ్ఛమైన తాగునీటిని అందించడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో అసిస్ట్ సంస్థ, ఓఎన్జీసీలు చేస్తున్న కృషిని అభినందించారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి ఈ ప్లాంట్లు ఎంతగానో ఉపయోగపడతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో అసిస్ట్ సంస్థ నుండి అసోసియేట్ డైరెక్టర్లు జే.కృష్ణ హరీష్, ఎం.విష్ణుప్రియ, స్థానిక నాయకులు తేళ్ల సుబ్బారావు, అసిస్ట్ కోఆర్డినేటర్ వెంకయ్య మరియు మేలుకొలుపు సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
COMMENTS