రాష్ట్ర స్థాయిలో అవార్డుకు ఎంపికైన దళిత బహుజన రిసోర్స్ సెంటర్.. జిల్లా స్థాయిలో 16 విభాగాల్లో 51 మంది వ్యక్తులు/సంస్థలకు అవార్డులు. కలెక్టర...
రాష్ట్ర స్థాయిలో అవార్డుకు ఎంపికైన దళిత బహుజన రిసోర్స్ సెంటర్..
జిల్లా స్థాయిలో 16 విభాగాల్లో 51 మంది వ్యక్తులు/సంస్థలకు అవార్డులు.
కలెక్టర్ కృతిక శుక్లా..
నరసరావు పేట: రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛత కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ అందించనున్న స్వచ్ఛ ఆంధ్ర అవార్డులను అక్టోబరు 06 న ప్రదానం చేయనున్నామని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా పేర్కొన్నారు.
స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డుల పేరుతో కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛతా అవార్డులను ప్రకటిస్తోందని, అదే బాటలో స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు ప్రదానం చేయడం ద్వారా దేశంలోనే మొదటి స్వచ్ఛతా అవార్డులను అందిస్తున్న రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ అవతరించిందని తెలిపారు.
రాష్ట్ర స్థాయిలో ఉత్తమ స్వచ్ఛతా ఎన్జీఓ గా దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఎంపికైంది వెల్లడించారు. జిల్లా స్థాయిలో 16 విభాగాల్లో 51 మంది వ్యక్తులు/సంస్థలు అవార్డులు దక్కించుకున్నాయన్నారు.
అక్టోబరు 06 న జిల్లా ఇంచార్జ్ మంత్రి చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేస్తామన్నారు. స్వచ్ఛ నగర, మండలాలు, స్వచ్ఛ గ్రామ పంచాయతీలు, స్వచ్ఛ పాఠశాలలు, స్వచ్ఛ ఆసుపత్రులు, స్వచ్ఛ కార్యాలయాలు, స్వచ్ఛ రైతు బజార్లు, స్వచ్ఛ బస్ స్టేషన్లు, స్వచ్ఛ పరిశ్రమలు మొదలైన వివిధ విభాగాలలో అవార్డులకు ఎంపిక చేయడం జరిగిందని వివరించారు. స్వచ్ఛ ఆంధ్ర ప్రోత్సాహక అవార్డులు - 2025కు, స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర (SASA) కార్యక్రమాల కింద స్వచ్ఛతా కార్యకలాపాలపై చేసిన ప్రశంశనీయ కృషిని గుర్తించడానికి ప్రభుత్వం అవార్డులను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందేనని అన్నారు. ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, బహిరంగ ప్రదేశాలలో శుభ్రత, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం, RRR (తగ్గించటం, మళ్లీ ఉపయోగించడం, రీసైకిల్), సుస్థిర పద్ధతులలో కొత్త ప్రమాణాలను నిర్ణయించడం తదితర అంశాలలో అవార్డు గ్రహీతలు పని చేయడం జరిగిందన్నారు. అవార్డులను మొత్తం 17 కేటగిరీలలో ప్రభుత్వం ఇవ్వడం జరిగిందని చెప్పారు. వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభను గుర్తించడానికి, అన్ని రంగాలలో ఉన్న వారి భాగస్వామ్యం పెంచుటకు స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. స్వయం మూల్యాంకనం, జిల్లా అధికారుల పరిశీలన, తృతీయ పక్ష మూల్యాంకనంగా మూడు దశల్లో
స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు - 2025 రేటింగ్/ర్యాంకింగ్ జరిగిందన్నారు. స్వయంమూల్యాంకనంలో 1,20,057 కేంద్రాలు పాల్గొన్నాయని, జిల్లా స్థాయి పరిశీలనలో 1,12,833 కేంద్రాలలో నిర్వహించడం జరిగిందని యన్నారు.
రాష్ట్ర, జిల్లా స్థాయి అవార్డు గ్రహీతల పూర్తి వివరాలను SASA పోర్టల్ (https://sasa.ap.gov.in/) నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
“స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్ 2025 విజేతలను మనమంతా హర్షభావంతో అభినందిద్దాం. ఈ విజయాలు స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర (SASA) ఉద్యమాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్లే స్ఫూర్తినిస్తాయని జిల్లా కలెక్టర్ తెలిపారు.
COMMENTS