ఎడ్లపాడు మండల ఎంపీడీవో కార్యాలయంలో ఈరోజు థీమ్-5కు లొకల్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ (ఎల్‌ఎస్‌డిజీ ఎస్) శిక్షణ కార్యక్రమం ని...
ఎడ్లపాడు మండల ఎంపీడీవో కార్యాలయంలో ఈరోజు థీమ్-5కు లొకల్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ (ఎల్‌ఎస్‌డిజీ ఎస్) శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. స్వచ్ఛత అవగాహనపై సాగిన ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వి.హేమలత మాట్లాడుతూ తడి చెత్త, పొడి చెత్తలను వేరు చేయడం ద్వారా చెత్తను సంపదగా మలచుకునే పద్ధతిని ప్రతి ఇంటి సభ్యుడు అవగాహన చేసుకోవాలని సూచించారు.చెత్తలోనుండి ఉపయోగకర వస్తువులను సిద్ధం చేసే విధానాలు ఇంటి అవసరాలు తీర్చుకునే దిశగా తోడ్పడతాయని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డి జాకీర్ హుస్సేన్, ఎస్ బి హెచ్ గ్రూపుల నాయకులు మరియు టీమ్ సభ్యులు పాల్గొన్నారు.
COMMENTS