వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్. స్థానిక కలెక్టరేట్ లో వ్యవసాయ, ఉద్యాన, ...
వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్.
స్థానిక కలెక్టరేట్ లో వ్యవసాయ, ఉద్యాన, నీటిపారుదల, లీడ్ డిస్ట్రిక్ మేనేజర్, సూక్ష్మ నీటిపారుదల, ప్రకృతి వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి శాఖలకు, సంబంధించిన అధికారులతో సమన్వయ కమిటీ సమావేశము నిర్వహించిన జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా.వ్యవసాయశాఖకు సంబంధించి ఖరీఫ్ సీజన్ 2025 లో జిల్లాలో రైతులు సాగుచేయుచున్న వివిధ పంటల సరళి, నీటి వనరుల కింద సాగు చేయు పంటల వివరములు జిల్లా వ్యవసాయ అధికారి యం.జగ్గారావు వివరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూసార పరీక్షా ఫలితాల ఆవశ్యకతను రైతులకు గ్రామ స్థాయిలో తెలియ పరచాలని , ఇ-పంట నమోదును త్వరితగతిన పూర్తి చేయాలని, కిసాన్ డ్రోన్ లను రైతులు ఉపయోగించుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు.జిల్లాలో బ్లాక్ బార్లీ పొగాకు సాగును రబీ 25-26 సీజన్ లో పూర్తిగా నిషేదించాలని, ఆ సందేశం గ్రామాలలో రైతులకు వ్యవసాయ శాఖ సిబ్బంది తెలియపరచాలని అన్నారు.వరి, ప్రత్తి, మొక్కజొన్న పంటల సాగు, దిగుబడి వివరములు, మార్కెటింగ్ గురించి, పొగాకుకు ప్రత్యామ్నాయ పంటల సాగు, రబీ శనగ విస్తీర్ణం ఎంత విస్తీర్ణంలో సాగు అవుతుందని అడిగారు.యూరియా కొరత రాకుండా సకాలములో రైతులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
లీడ్ డిస్ట్రిక్ మేనేజర్ గ్రామ స్థాయిలో బ్యాంకు అధికారిని నియమించుకొని రైతు సేవా కేంద్ర సిబ్బంది తో సమన్వయం చేసుకుంటూ కౌలు రైతులకు రుణ మంజూరు త్వరిత గతిన ఇవ్వాలని ఆదేశించారు.జిల్లా ఉద్యానవన శాఖ అధికారి వెంకటరావు, ఇప్పటి వరకు సాగు అయిన వివిధ పంటల విస్తీర్ణం, వారి శాఖ ద్వారా అమలు చేయుచున్న ప్రభుత్వ పధకముల సబ్సిడీ వివరములు ఆయిల్ పామ్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం క్రింద 15 మండలాలలో సాగు చేయడం జరుగుచున్నదని తెలిపారు. అవకాడో, డ్రాగన్ ఫ్రూట్ సాగును ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. గ్రామీణాభివృద్ధి శాఖ పిడి ఝాన్సీ డ్రోన్ దీదీ పధకం క్రింద 28 మండలాలకు 28 చొప్పున ప్రతిపాదనలు ప్రభుత్వం వారికి సమర్పించారని తెలిపారు.
ఉద్యాన శాఖ వారితో సమన్వయం చేసుకొని సబ్సిడీ పదకములను రైతులకు చేరువ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
సూక్ష్మ సేధ్యం అధికారి ఆంజనేయులు ఇప్పటవరకు 3500 వికరములలో మైక్రోఇరిగేషన్ ప్రాజెక్టును అమలు చేస్తున్నామని వివరించారు. వినుకొండ, మాచర్ల సబ్ డివిజన్లలో డ్రాప్ వినియోగం ద్వారా రైతులు మిరప, కరివీపాకు సాగులో అధిక దిగుబడి సాదిసున్నారు అని తెలిపారు.
నీటిపారుదల శాఖ అధికారి మాట్లాడుతూ ఆయకట్ట 5 లక్షల ఎకరాల వరకు మెట్ట మరియు మాగాణి భూములకు పల్నాడు జిలాలో ఎన్ఎస్పి కుడి కాల్వ ద్వారా పంట సాగు భూములకు నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు. కాల్వ చివరి భూమి వరకు పంట పొలాలకు నీరు అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. మార్కెటింగ్ శాఖ అధికారులు జిల్లలో 20 కోల్డ్ స్టోరేజ్ లు రైతులకు అందుబాటులో ఉన్నాయని వివరించారు.అమల కుమారి ప్రకృతి వ్యవసాయం సాగు పద్దతులను వివరించారు. గ్రామ స్థాయిలో సిబ్బంది రైతుకు పంటల సరళి గురించి వివరించాలని, ఉద్యాన, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను సమన్వయము చేసుకుంటూ పధకాన్ని విస్తృతం చేయాలని, రైతుసేవాకేంద్రం సిబ్బందికి శిక్షణా కార్యక్రమము జిల్లాలో రెండు రోజులు ముందుగా నిర్ణయించిన తేదీలలో ఓకేసారి నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
COMMENTS