పల్నాడు:పర్యాటక ప్రాధాన్యం కలిగిన ఎత్తిపోతల జలపాతాన్ని బుధవారం పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా సందర్శించారు.ఈ సందర్భంగా జల...
పల్నాడు:పర్యాటక ప్రాధాన్యం కలిగిన ఎత్తిపోతల జలపాతాన్ని బుధవారం పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా సందర్శించారు.ఈ సందర్భంగా జలపాతం పరిసరాల్లో పర్యాటకులకు అందిస్తున్న సౌకర్యాలు, శుభ్రత, భద్రతా ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. స్థానిక అధికారులు కలెక్టర్‌కు పర్యాటకుల రాకపోకలు, ప్రస్తుత సౌకర్యాలు, అభివృద్ధి పనులపై వివరాలు అందించారు.
జలపాతం వద్ద మరింత పర్యాటకులను ఆకర్షించే విధంగా ఆధునిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సంబంధిత శాఖాధికారులకు సూచించారు. పర్యావరణానికి హానీ కలగకుండా పర్యాటక సౌకర్యాలు రూపకల్పన చేయాలని ఆమె సూచించారు. ఎత్తిపోతల జలపాతం అందాలు చూసేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు రాకపోకలు జరుపుకోవడంతో, పర్యాటక రంగ అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులు పట్ల ఆదేశాలు జారీ చేశారు.
COMMENTS