పల్నాడు:నరసరావుపేట మార్కెట్ యార్డు వద్ద గల ఈవీఎం గోడౌన్లను సాధారణ తనిఖీలలో భాగంగా రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి పరిశీలించిన ...
పల్నాడు:నరసరావుపేట మార్కెట్ యార్డు వద్ద గల ఈవీఎం గోడౌన్లను సాధారణ తనిఖీలలో భాగంగా రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి పరిశీలించిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా.
ఎలక్ట్రానికి ఓటింగ్ మిషన్ల గోడౌన్ ను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తనిఖీ చేశారు. స్థానిక నరసరావుపేట మార్కెట్ యార్డ్ నందు ఉన్న ఈవిఎం యంత్రాలు, వివిప్యాట్ లు భధ్రపరిచిన గోడౌన్ ను తనిఖీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈవీఎం గోడౌన్ తనిఖిలో భాగంగా ఈవిఎం గోడౌన్ కు వేసిన భధ్రతా సీళ్లు, సిసి కెమెరాలు పనితీరు, అగ్నిమాపక దళ పరికరాలు, మొదలైనవి పరిశీలించారు. అనంతరం సెక్యూరిటీ లాగ్ బుక్ ను పరిశీలించి అందులో సంతకం చేశారు.జిల్లా కలెక్టర్ వెంట జిల్లా రెవెన్యూ అధికారి మురళి, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సిబ్బంది ఉన్నారు.
COMMENTS