ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12 జిల్లాల కలెక్టర్ల బదిలీలు చోటు చేసుకున్నాయి. తాజా ఉత్తర్వుల ప్రకారం పలు జిల్లాలకు కొత్త కలెక్టర్లు ని...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12 జిల్లాల కలెక్టర్ల బదిలీలు చోటు చేసుకున్నాయి. తాజా ఉత్తర్వుల ప్రకారం పలు జిల్లాలకు కొత్త కలెక్టర్లు నియమితులయ్యారు. ప్రభుత్వ ఆదేశాలతో నియామకాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌గా ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు.
విజయనగరం కొత్త కలెక్టరుగా రామసుందర్ రెడ్డి నియమితులయ్యారు.
ఈస్ట్ గోదావరి జిల్లా కలెక్టర్‌గా కీర్తి చేకూరి బాధ్యతలు స్వీకరించనున్నారు.
గుంటూరు కొత్త కలెక్టరుగా తమీమ్ అన్సారియా నియమించబడ్డారు.
పల్నాడు జిల్లా కలెక్టర్‌గా కృతిక శుక్లా నియమితులయ్యారు.
బాపట్ల కలెక్టర్‌గా వినోద్ కుమార్ బాధ్యతలు చేపడతారు.
ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా రాజా బాబు నియమితులయ్యారు.
నెల్లూరు కలెక్టర్‌గా హిమాన్షు శుక్లా నియమించబడ్డారు.
అన్నమయ్య జిల్లా కలెక్టర్‌గా నిషాంత్ కుమార్ బాధ్యతలు చేపడతారు.
కర్నూలు జిల్లా కలెక్టర్‌గా డాక్టర్ ఎ. సిరి నియమితులయ్యారు.
అనంతపురం జిల్లా కొత్త కలెక్టరుగా ఓ. ఆనంద్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
సత్యసాయి జిల్లా కలెక్టర్‌గా శ్యాంప్రసాద్ నియమితులయ్యారు.
ఈ మార్పులు రాష్ట్ర పరిపాలనా విభాగం చేపట్టిన తాజా నిర్ణయాలలో భాగంగా జరిగాయి.
COMMENTS