పీపీపీ విధానం లేకుండా ప్రపంచంలో ఎక్కడైనా అభివృద్ధి జరుగుతుందా? రాష్ట్రంలో ఎరువల కొరత జగన్.. ఆయన అవినీతి మీడియా సృష్టే ...
పీపీపీ విధానం లేకుండా ప్రపంచంలో ఎక్కడైనా అభివృద్ధి జరుగుతుందా?
రాష్ట్రంలో ఎరువల కొరత జగన్.. ఆయన అవినీతి మీడియా సృష్టే
సూపర్ సిక్స్ పథకాలు కంటే సూపర్ హిట్ సభ రెట్టింపు విజయవంతమవుతుంది.
అనంతపురంలో నేడు జరిగే ప్రభుత్వ బహిరంగసభ ఏర్పాట్లు పరిశీలించిన మాజీమంత్రి ప్రత్తిపాటి.
17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చానని చెప్పుకుంటున్న జగన్.. వాటిని సకాలంలో పూర్తిచేసి పేదవిద్యార్థులకు ఎందుకు వైద్యవిద్యను అందుబాటులోకి తీసుకురాలేకపోయారో సమాధానం చెప్పాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు డిమాండ్ చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం అనేది ప్రపంచవ్యాప్తంగా అన్నిరంగాల్లో ఉందని, ఆ విధానం లేకుండా ఏ రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో జగన్ చెప్పాలన్నారు.
సూపర్ సిక్స్ – సూపర్ హిట్ విజయోత్సవ సభా నిర్వహణలో భాగంగా ప్రత్తిపాటి ఉరవకొండ నియోజకవర్గంలో పర్యటించారు. సభను విజయవంతం చేయడంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన ప్రత్తిపాటి, అనంతరం టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస, మంత్రులు పయ్యావుల కేశవ్, సవిత, సత్యకుమార్, చిప్ విప్ జీ.వి. ఆంజనేయులు మరియు ఎమ్మెల్యే లతో కలిసి అనంతపురం సమీపంలోని ఇంద్రప్రస్థనగర్లో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. అనంతరం తాడిపత్రి శాసనసభ్యులు జే.సి. అస్మిత్ రెడ్డి నీ, ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఏలూరి సాంబశివరావు, అరిమల్ల రాధాకృష్ణ, లీడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు గారితో కలిసి జనసమీకరణ ఏర్పాట్లు చర్చించారు.
*మెడికల్ కాలేజీలపై డబ్బాలు కొట్టుకోవడమే తప్ప జగన్ చేసిందేమీ లేదు..*
జగన్ కేవలం దోపిడీ కోసమే వైద్య కళాశాలలను తీసుకొచ్చినట్టు ఉందన్న ప్రత్తిపాటి.. నిజంగా రాష్ట్ర వైద్యరంగాన్ని బలోపేతం చేయాలనే ఆలోచన ఆయనకుంటే కళాశాలలు నిర్మించేవాడన్నారు. మెడికల్ కాలేజీలపై డబ్బాలు కొట్టుకోవడం తప్ప ఐదేళ్లలో జగన్ చేసిందేమీ లేదన్నారు. జగన్ ది ప్రచార ఆర్భాటమైతే.. చంద్రబాబుది ఆచరణాత్మక విధానమని ప్రత్తిపాటి తెలిపారు. ప్రైవేట్ కళాశాలకు ధీటుగా ప్రభుత్వ విద్యాసంస్థల్ని కూటమిప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహిస్తోందన్నారు. జగన్ కు తెలిసింది విషప్రచారమేనని, వైసీపీ విధానాలతో విసుగెత్తే ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదన్నారు. సూపర్ సిక్స్ పథకాలు ఎంతగా విజయవంతం అయ్యాయో, సూపర్ హిట్ బహిరంగసభ అంతకు రెట్టింపు విజయవంతమవుతుందని ప్రత్తిపాటి చెప్పారు. 15 నెలల్లో ప్రజలకు చేసిన మంచిని చెప్పుకోవడానికే తమ ప్రభుత్వం సూపర్ హిట్ సభ నిర్వహిస్తోందన్నారు. జగన్ లా పరదాల మాటున, నాలుగ్గోడల మధ్యన కూర్చుని ప్రజల్ని ఏమార్చడం తమ నాయకుడికి తెలియదని, ప్రజల్లోకి వెళ్లి వారి కష్టసుఖాలు తెలుసుకుంటూ వారి ఆలోచనలు పంచుకుంటున్న నాయకుడిగా చంద్రబాబు కొత్త చరిత్ర సృష్టిస్తున్నారని ప్రత్తిపాటి పేర్కొన్నారు. జగన్ చేసిన విధ్వంసంతో పాటు ఎన్నోకష్టాలు, ఇబ్బందులు, సవాళ్లున్నా కూడా చంద్రబాబు ఇన్ని పథకాలు ఎలా అమలుచేస్తున్నారా అని ప్రజలే ఆశ్చర్యపోతున్నారన్నారు.
*రూ.10 లక్షలకోట్ల పెట్టుబడులు రావడం.. ఆ ఫలాలుప్రజలకు అందడం సామాన్య విషయం కాదు*
పెట్టుబడుల ఆకర్షణలో ప్రపంచమంతా రాష్ట్రంవైపు చూసే పరిస్థితి వచ్చిందని, అందుకు కారణం పారిశ్రామికవేత్తల్లో చంద్రబాబు పట్ల ఉన్న విశ్వసనీయత, నమ్మకమేనని ప్రత్తిపాటి తెలిపారు. రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు రానుండటం..వాటి ఫలితాలు ప్రజలకు అందడం సామాన్య విషయం కాదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు విధ్వంసం .. ప్రజలు ఛీ కొట్టాక విషప్రచారమే లక్ష్యంగా వైసీపీ కుట్ర రాజకీయాలు చేస్తోందన్నారు. తమను ప్రజలు మర్చిపోయారని గ్రహించే వైసీపీనేతలు, జగన్ ఉనికికోసం లేని సమస్యలపై నానాయాగీ చేస్తోందన్నారు. రాష్ట్రంలో సరిపడా యూరియా నిల్వలున్నా, కేంద్రం నుంచి సరఫరా అవతున్నా .. ఎరువల కొరత అంటూ జగన్, ఆయన అవినీతి మీడియా కట్టుకథలు అల్లుతోందని ప్రత్తిపాటి అసహనం వ్యక్తంచేశారు.
COMMENTS