ప్రజా ప్రయోజనాలే ఫస్ట్ అనే నినాదంతో ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పల్నాడు నూతన జిల్లా కలెక...
ప్రజా ప్రయోజనాలే ఫస్ట్ అనే నినాదంతో ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పల్నాడు నూతన జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా పేర్కొన్నారు. శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లో జిల్లా కలెక్టరుగా కృతిక శుక్లా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా ప్రతినిథులు, ప్రభుత్వ అధికారుల సమన్వయంతో ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు చేసి, జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. 2016-18 కాలంలో ఉమ్మడి గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టరుగా పల్నాడు ప్రాంతంలో విరివిగా చేసిన పర్యటనలు తనకు ఉపయోగపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
కృతిక శుక్లా ఐఏఎస్ గతంలో నిర్వర్తించిన బాధ్యతల వివరాలు...
22-07-2024 నుండి 12-09-2025 వరకు డైరెక్టర్, ఇంటర్మీడియట్ విద్య
22-07-2024 నుండి 12-09-2025 వరకు డైరెక్టర్, వయోజన విద్య
22-07-2024 నుండి 12-09-2025 వరకు సెక్రటరీ, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్
04-04-2022 నుండి 28-03-2024 వరకు కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్, కాకినాడ
06-02-2020 నుండి 04-04-2022 వరకు డైరెక్టర్, జువెనైల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్
06-02-2020 నుండి 04-04-2022 వరకు డైరెక్టర్, డిఫరెంట్‌గా అబిల్డ్ & సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్
06-02-2020 నుండి 04-04-2022 వరకు మేనేజింగ్ డైరెక్టర్, APDASCAC
03-01-2020 నుండి 04-04-2022 వరకు డైరెక్టర్, మహిళా అభివృద్ధి & శిశు సంక్షేమం మరియు DISHA స్పెషల్ ఆఫీసర్
24-06-2019 నుండి 02-01-2020 వరకు డైరెక్టర్, మహిళా అభివృద్ధి & శిశు సంక్షేమం
11-02-2019 నుండి 24-06-2019 వరకు జాయింట్ కలెక్టర్ & అదనపు జిల్లా మేజిస్ట్రేట్, కృష్ణాజిల్లా
02-11-2018 నుండి 09-02-2019 వరకు డిప్యూటీ సీఈవో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్
18-11-2016 నుండి 12-08-2018 వరకు జాయింట్ కలెక్టర్, గుంటూరు
05-12-2015 నుండి 14-11-2016 వరకు సబ్ కలెక్టర్, మదనపల్లి
25-04-2015 నుండి 30-11-2015 వరకు
అసిస్టెంట్ కలెక్టర్, విశాఖపట్నం
02-09-2013 నుండి 13-04-2015 వరకు IAS (ప్రొబేషనర్), జమ్మూ & కాశ్మీర్ క్యాడర్.
COMMENTS