వర్షాకాలంలో స్మార్ట్ ఫోన్ వంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే ప్రమాదాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉ...
వర్షాకాలంలో స్మార్ట్ ఫోన్ వంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే ప్రమాదాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల బయటకు వెళ్తున్న సమయంలో ఫోన్ తోపాటు ఇతర పరికరాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే మొబైల్ డ్యామేజీ కావడం లేదా పూర్తిగా పనిచేయకపోయే ప్రమాదం ఉంది. కొన్ని చిట్కాల ద్వారా తక్కువ ఖర్చుతోనే ఫోన్ సహా ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలను సురక్షితంగా ఉంచుకోవచ్చు.
వాటర్ ప్రూఫ్ కేస్ లేదా బ్యాగ్ : వర్షాకాలంలో బయటకు వెళ్లే సమయాల్లో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తడవకుండా ఉండేందుకు వాటర్ ప్రూఫ్ ఫోన్ కేస్ ను ఉపయోగించుకోవచ్చు. లేదా వాటర్ ప్రూఫ్ బ్యాగ్ కూడా వర్షం నుంచి స్మార్ట్‌ఫోన్ వంటి గ్యాడ్జెట్స్ ను సురక్షితంగా ఉంచుతుంది.వీటితోపాటు జిప్‌లాక్ సిలికా కవర్స్ కూడా స్మార్ట్ ఫోన్ తడవకుండా ఉండేలా చూస్తాయి. ప్రస్తుతం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ లో ఈ తరహా కవర్స్ లభిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ తోపాటు ఇతర గ్యాడ్జెట్స్ కోసం కొనుగోలు చేయవచ్చు. తక్కువ ధరకే మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి.
బ్లూటూత్ ఇయర్‌బడ్స్ : దీంతోపాటు వర్షం పడుతున్న సమయంలో అత్యవసరంగా ఫోన్ కాల్ మాట్లాడాల్సి వస్తే.. బ్లూటూత్ ఇయర్ బడ్స్ వంటివి ఉపయోగించడం ఉత్తమం. ఫలితంగా ఫోన్ తడిచిపోకుండా ఉంటుంది. పొరపాటున స్మార్ట్ ఫోన్ తడిస్తే మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
ఫోన్ నీటిలో తడిస్తే : వర్షంలో ఫోన్ తడిస్తే.. ఫోన్ బ్యాటరీ తీసివేయడం మంచిది. ఒకవేళ బ్యాటరీ బయటకు తీసేందుకు అవకాశం లేకుంటే.. ఫోన్ పూర్తిగా పొడిగా మారేంత వరకు ఛార్జింగ్ చేయకూడదు. ఇతర విభాగాలను విడదీసేందుకు ప్రయత్నం చేయకూడదు. ఇలా చేస్తే ఫోన్ అంతర్గత భాగాల్లోకి నీరు చేరే అవకాశం ఉంటుంది.
రాత్రంతా బియ్యంలో : స్మార్ట్‌ఫోన్ ను ఆరబెట్టేందుకు రాత్రంతా బియ్యంలో పెట్టాలి. ఇలా చేయడం వల్ల ఫోన్ చాలా వరకు పొడిబారేందుకు అవకాశం ఉంటుంది. దీంతోపాటు గాలి బాగా వచ్చే ప్రాంతంలో ఫోన్‌ను ఉంచాలి. ఫలితంగా ఫోన్‌లోని నీరు బయటకు వచ్చి, త్వరలో ఫోన్ పొడిబారేందుకు అవకాశం ఉంటుంది.
హెయిర్ డ్రయర్ అసలే వద్దు : కొంత మంది గ్యాస్ లేదా వేడి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఉంచేందుకు ప్రయత్నం చేస్తారు. దీని వల్ల ఫోన్ పూర్తిగా డ్యామేజీ అయ్యే అవకాశం ఉంటుంది. వర్షంలో ఫోన్ తడిచిన వెంటనే కొంత మంది హెయిర్ డ్రయర్ తో అందులోని నీటిని పోగొట్టేందుకు ప్రయత్నం చేస్తారు. దీని కారణంగా ఫోన్ త్వరగా డ్యామేజీ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. అంతా బాగానే అనిపించినా.
. నిపుణులతో తనిఖీ చేశాకే : ఫోన్ లో నుంచి నీరు పూర్తిగా బయటకు వచ్చేంత వరకు ఛార్జింగ్ పెట్టేందుకు ప్రయత్నం చేయకూడదు. దీంతోపాటు ఫోన్ పూర్తిగా పొడిబారినట్లు అనిపించినా.. సమీపంలోని సర్వీస్ సెంటర్ లో పూర్తిగా తనిఖీ చేయింది. తిరిగి ఉపయోగించుకోవడం ఉత్తమం.

COMMENTS