నరసరావుపేట లోని మార్కెట్ యార్డ్ నందు గల పౌర సరఫరాల మండల స్థాయి స్టాక్ పాయింట్ ను(ఎం.ఎల్.ఎస్) ఆకస్మిక తనిఖీ చేసి స్టాక్ రిజిస్టర్...
నరసరావుపేట లోని మార్కెట్ యార్డ్ నందు గల పౌర సరఫరాల మండల స్థాయి స్టాక్ పాయింట్ ను(ఎం.ఎల్.ఎస్) ఆకస్మిక తనిఖీ చేసి స్టాక్ రిజిస్టర్లు సక్రమంగా ఉండాలని, అక్రమాలకు తావు లేకుండా సకాలంలో రేషన్ సరుకులు ప్రజలకు చేరవేయాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా సూచించారు. అదే విధంగా అగ్రికల్చరర్ మార్కెట్ యార్డులో చౌకధరల దుకాణాలకు పంపిణి కేంద్రంలో రైతు బజారును ఏర్పాటు చేయు ఉద్దేశములో స్థల పరిశీలన నియంత్రం మార్కెట్ యార్డును పరిశీలన చేసారు. తదనుగుణంగా మార్కెట్ యార్డు లోపల పని చేయుచున్న సివిల్ సప్లయస్ నరసరావుపేట మండల స్టాక్ పాయింట్ ను కూడా పరిశీలన చేసారు. స్టాక్ పాయింట్ ఇంచార్జ్ జయప్రకాష్ ను, కలెక్టర్ కృతిక శుక్లా పిడిఎస్ బియ్యంకి ఏమి సరుకులు ఇస్తున్నారు మరియు అంగన్ వాడి పిల్లలకు మరియు గర్భిణి స్త్రీలకు ఏమి సరుకులు ఇస్తున్నారు అని అదే విధంగా మధ్యాహ్న భోజనానికి స్కూళ్లకు మరియు హాస్టళ్లకు ఏమి ఇస్తున్నారు అని వివరాలు అడిగి మరియు ఇచ్చేటటువంటి సరుకులను కూడా పరిశీలన చేసారు. వారు ఇచ్చిన సమాచారము మరియు స్వీయ పరిశీలన ద్వారా కలెక్టర్ సంతృప్తి వ్యక్త పరచినారు. బియ్యం సంచులు బరువు చూచి సంతృప్తి వ్యక్త పరిచినారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఈకా మురళీ, ఎడి మార్కెటింగ్ కే.వి.ఎన్ ఉపేంద్ర కుమార్, పట్టణ మున్సిపల్ కమిషనర్ జశ్వంత్ రావు, నరసరావుపేట తహసిల్దార్ వేణుగోపాల్ రావు, తదితరులు పాల్గొన్నారు.
COMMENTS