రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ.1.50 లక్షల వరకూ ఉచిత వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా...
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ.1.50 లక్షల వరకూ ఉచిత వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు వెల్లడించారు. జాతీయ ఆరోగ్య అథారిటీ వద్ద నమోదైన ఆసుపత్రుల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందన్నారు. జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రులు జాతీయ ఆరోగ్య అథారిటీలో నమోదు చేసుకునేలా ప్రోత్సహిస్తున్నామన్నారు.
బుధవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ ఎస్ ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి రోడ్లు భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గీతా రాణి మెంబర్ సెక్రటరీ గా వ్యవహరించి, ముందుగా జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల గణాంకాలను వివరిస్తూ ప్రజెంటేషన్ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు నిరోధించడంలో పోలీసు, రవాణా, ఆర్ అండ్ బి వంటి శాఖలు కృషి చేయాలన్నారు.
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు శాఖ తీసుకుంటున్న చర్యల వల్ల జాతీయ హైవేలు, రాష్ట్ర హైవేలపై రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గుదల పట్టిందన్నారు. అయితే ఇతర రోడ్లలో ప్రమాదాల సంఖ్య పెరుగుతోందన్నారు. మైనర్ రోడ్లపై ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ సమావేశంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ రవి,ఆర్డీవో మధులత ఆర్టీసీ ఆర్ఎం అజిత కుమారి,డీఈవో చంద్రకళ జిల్లా రవాణా శాఖ అధికారి సంజీవ్ కుమార్, జిల్లా ఎక్సైజ్ సూపరిండెంట్,ఎన్.హెచ్ఐ అధికారులు,నరసరావు పేట మున్సిపల్ కమిషనర్ జస్వంత్ రావు,జిల్లాలో ఉన్న మున్సిపల్ కమిషనర్లు ఎన్జీవో నుండి రోడ్ కమిటీ సభ్యులు, ఎన్జీవో నుండి రోడ్డు సేఫ్టీ ఎన్జీవో ప్రెసిడెంట్ ఆర్ కనకదుర్గ పద్మజ తదితరులు పాల్గొన్నారు.
COMMENTS