ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించని జగన్, మెడికల్ కాలేజీలు కట్టానంటే ప్రజలు నమ్ముతారా? : ప్రత్తిపాటి తన పాలనలో వైద్య విద్యను జగన్ వ్య...
ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించని జగన్, మెడికల్ కాలేజీలు కట్టానంటే ప్రజలు నమ్ముతారా? : ప్రత్తిపాటి
తన పాలనలో వైద్య విద్యను జగన్ వ్యాపార వస్తువుగా మార్చారు. ప్రకృతి వనరులు, ప్రభుత్వ ఆస్తులు అమ్మినట్టే మెడికల్ సీట్లు అంగడి సరుకుగా మార్చిన ఘనుడు జగన్. భావివైద్యుల బంగారు భవిష్యత్తును తన అవినీతికి పణంగా పెట్టిన డబ్బుమనిషి.
కళాశాలలు నిర్మించకుండా, వసతులు లేకుండా మొక్కుబడిగా ప్రారంభించి వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోవడానికి జగన్ ఆరాటపడ్డారు. రాష్ట్రప్రభుత్వం నుంచి రూపాయి విడుదల చేయకుండా కాలేజీలు ఎలా నిర్మించారో జగన్ చెప్పాలి.నిధులు ఇవ్వకుండా 17 మెడికల్ కాలేజీలు తానే కట్టించినట్టు, రాష్ట్రానికి కొత్తగా వైద్యవిద్యను పరిచయం చేసినట్టు దుష్ప్రచారం చేసుకోవడం జగన్ లాంటి అవకాశవాదికే చెల్లింది.
ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించని వారు మెడికల్ కాలేజీలు కట్టారంటే ప్రజలు నమ్ముతారా? జగన్ ఎగనామం పెట్టిన రూ.4,300 కోట్ల బకాయిలు కూటమి ప్రభుత్వం చెల్లించింది నిజం కాదా? అబద్దమనే బురదలో పెరిగిన అవినీతి చెట్టుకు కాసిన పిచ్చికాయ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ కాయ విషం రుచిచూసే ఐదేళ్లపాటు ఏపీ ప్రజలు నరకయాతన పడ్డారు.
ఒక వైద్యుడి కొడుకుగా పుట్టి ... వైద్యవిద్యను నిర్లక్ష్యం చేసినందుకు జగన్ నిజంగా సిగ్గుపడాలి. రాష్ట్ర వైద్యరంగాన్ని భ్రష్టు పట్టించి, ప్రభుత్వ వైద్యాన్ని నీరుగార్చి, కల్తీమద్యంతో పేదల ఉసురు తీసిన పాపం జగన్ కుటుంబాన్ని తరతరాలు వెంటాడుతుంది.అని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఒక ప్రకటనలో తెలిపారు.
COMMENTS