రోడ్డు ప్రమాదానికి గురైన పాత్రికేయుడు రమేష్‌కి అండగా నిలిచిన తోటి జర్నలిస్టులు. చిలకలూరిపేట: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొం...
రోడ్డు ప్రమాదానికి గురైన పాత్రికేయుడు రమేష్‌కి అండగా నిలిచిన తోటి జర్నలిస్టులు.
చిలకలూరిపేట: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న ఏపీయూడబ్ల్యూజే అనుబంధమైన ప్రెస్ క్లబ్ చిలకలూరిపేట యూనియన్ సభ్యుడు, పాత్రికేయుడు కోర్నేపాటి రమేష్‌కి ప్రెస్ క్లబ్ తరపున రూ.5,000 ఆర్థిక సహాయం అందజేశారు.పట్టణంలోని ఆయన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న రమేష్‌ను పరామర్శించి ఈ సహాయాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ చిలకలూరిపేట యూనియన్ అధ్యక్షులు, ఏపీయూడబ్ల్యూజే పల్నాడు జిల్లా కమిటీ సభ్యులు అడపా అశోక్ మాట్లాడుతూ, అనుకోని ప్రమాదాలకు గురైన పాత్రికేయ మిత్రులకు ఒకరికి ఒకరు అండగా నిలవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రమేష్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే స్టేట్ మాజీ కౌన్సిల్ మెంబర్ షేక్ మస్తాన్ వలి, ప్రెస్ క్లబ్ చిలకలూరిపేట సెక్రటరీ షేక్ దరియా వలి, ఉపాధ్యక్షులు కొచ్చర్ల చందు, జాయింట్ సెక్రటరీ సుందర్ బాబు, సయ్యద్ సిద్దిక్, నరసింహల శ్రీకాంత్,వై.రవి కిరణ్, శివన్నారాయణ, మనోహర్,రావిపాటి రాజా తదితరులు పాల్గొన్నారు.
COMMENTS