వినుకొండ మండలం నడిగడ్డ గ్రామంలో సాగు చేయబడుతున్న వివిధ రకాల ఉద్యాన పంటలను బుధవారం డా. కె.శ్రీనివాసులు సంచాలకులు, ఉద్యాన మరియు ప...
వినుకొండ మండలం నడిగడ్డ గ్రామంలో సాగు చేయబడుతున్న వివిధ రకాల ఉద్యాన పంటలను బుధవారం డా. కె.శ్రీనివాసులు సంచాలకులు, ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ వారు సందర్శించడం జరిగినది.ఈ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ ఉద్యాన శాఖ సహకారంతో పర్వతనేని శ్రీనివాసరావు సాగుచేసిన డ్రాగన్ ఫ్రూట్ లో అంతర పంటగా మునగ పంట సాగు చేసిన తోటను సందర్శించడం జరిగినది.ఈ పంటల యొక్క ఆదాయ వ్యయాల వివరములను రైతు ద్వారా తెలుసుకోవడం జరిగినది. పండ్ల తోటల యందు అంతర పంటలను సాగు చేయటం ద్వారా రైతులు అధిక ఫలసాయమును పొందవచ్చునని సూచించారు. అదేవిధంగా ఉద్యాన శాఖ సహకారంతో జి.శశిధర్ గుప్తా సాగు చేయుచున్న దానిమ్మ మరియు బత్తాయి పండ్ల తోటల యొక్క సాగుని పరిశీలించారు. డ్రిప్ పద్ధతిలో మరియు మల్చింగ్ వాడటం వలన తోటల యందు తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణం సాగు చేయవచ్చునని తెలిపారు. దీని ద్వారా కూలీ ఖర్చులను గణనీయంగా తగ్గించుకొని ఎక్కువ దిగుబడి పొందటానికి అవకాశం ఉందన్నారు.
డైరెక్టర్ రైతుల తోటలో ఉన్నటువంటి సామూహిక పంట కుంటను సందర్శించారు. ఇదే విధంగా మిగతా రైతులు కూడా పండ్ల తోటల యందు పంట కుంటలను నిర్మించుకొని వాటిలో నిలువ ఉన్న నీటితో డ్రిప్ పద్ధతి ద్వారా నీటి కొరతను అధిగమించి అధిక దిగుబడులను సాధించవచ్చునని తెలిపారు.
గ్రామంలో ఉన్నటువంటి వినుకొండ ఉద్యాన రైతుల ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ ద్వారా చేపడుతున్న వివిధ రకాల కార్యక్రమాల గురించి తెలుసుకున్నారు.
గ్రామంలో ఈ పంట నమోదు యొక్క పురోగతి మరియు ఈ పంట నమోదు కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించడం జరిగినది.
జిల్లాలో ఉద్యాన శాఖ ద్వారా అమలవుతున్న వివిధ పథకాల యొక్క అమలు మరియు వాటి యొక్క పురోగతిని ఐ. వెంకట్రావు జిల్లా ఉద్యాన అధికారి ద్వారా తెలుసుకొని పథకాల యొక్క అమలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఐ. వెంకటరావు, జిల్లా ఉద్యాన అధికారి, జి. ఆంజనేయులు జిల్లా జిల్లా మైక్రో ఇరిగేషన్ ఆఫీసర్,షేక్. నబీ రసూల్ ఉద్యాన అధికారి వినుకొండ, వై. మోహన్, ఉద్యాన అధికారి, గురజాల, మండలంలోని గ్రామ ఉద్యాన సహాయకులు మరియు రైతులు పాల్గొన్నారు.
COMMENTS