పల్నాడు: పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ, ఆర్ధిక,ఆస్తి తగాదాలు,మోస...
పల్నాడు: పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ, ఆర్ధిక,ఆస్తి తగాదాలు,మోసం మొదలగు ఆయా సమస్యలకు సంబంధించి 111 ఫిర్యాదులు అందాయి.ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించడానికి కృషి చేయాలని ఎస్పీ సూచించారు.
సత్తెనపల్లి మండలం అబ్బూరు గ్రామానికి చెందిన పత్తిపాటి శివన్నారాయణ అను అతను దీపాల దిన్నె గ్రామంలోని సబ్ స్టేషన్లో పనిచేస్తున్నట్లు,ఇటీవల COSTCO యాప్ నందు 2,12,130/- రూపాయలు పెట్టుబడి పెట్టగా 52,470/- రూపాయలు వెనక్కు పంపినట్లు మిగిలిన డబ్బులు వెనక్కి పంపాలంటే ఎక్కువ మొత్తంలో పెట్టుబడి చేస్తే మనకు పంపిస్తామని చెప్పగా మోసపోయినట్లు తెలుసుకొని తనకు న్యాయం చేయవలసిందిగా ఎస్పీ ని కలిసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది.
చిలకలూరిపేట మండలం తాతపూడి గ్రామానికి చెందిన ఇంటూరి సుబ్బాయమ్మ 1.70 సెంట్ల భూమిని తన పెద్ద కుమారుడైన ఇంటూరి రంగనాథ్ బాబు పేరిట వీలునామా రాసి ఇవ్వగా తన పెద్ద కుమారుడు మరణానంతరం రఘునాధ బాబు పేరిట ఉన్న వీలునామా ను రద్దు పరిచి ఫిర్యాది తన పేరిట ఆన్లైన్ చేయించుకోవడం జరిగింది.కొంతకాలం తర్వాత ఇంటూరి రఘునాధ బాబు కుమారుడైన సుమంత్ ఫిర్యాది బాగోగులన్నియు చూసుకుంటానని చెప్పి నమ్మించి ఫిర్యాది పేరిట ఉన్న 1.70 సెంట్ల భూమిని తన పేరిట మార్చుకున్నట్లు, అవి కాకుండా అన్ని పేపర్ల పై సంతకములు చేయించుకుని 12 సవర్ల బంగారం, పది లక్షల డబ్బులు అప్పుగా తీసుకున్నట్లు నోట్లు వ్రాయించి మోసం చేసినందుకు గాను ఫిర్యాది తగిన న్యాయం కొరకు ఎస్పీ ని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది.
చిలకలూరిపేట మండలం పసుమతి గ్రామానికి చెందిన మందపల్లి ప్రసన్న ఆంజనేయులు క్రితం హైదరాబాద్ నందు చిన్న ప్రైవేటు ఉద్యోగం చేసినట్లు ఆ సమయంలో కే. ఉపేందర్ రెడ్డి అను అతను పరిచయమైనట్లు, తరువాత ఫిర్యాదు అక్కడి నుండి వచ్చి తన స్వగ్రామంలో ఉంటున్నట్లు, ది.10/07/2024 వ తేదీన ఉపేందర్ రెడ్డి ఫిర్యాదికి ఫోన్ చేసి తనకు తెలిసిన గూడపాటి ప్రసాద్ మరియు అతని భార్య గోడపాటి రాధిక అను వారి కన్స్ట్రక్షన్ చివరి స్టేజిలో ఉన్నట్లు, డబ్బులు అవసరం అయినట్లు, డబ్బులు సర్దుబాటు చేస్తే ఒక సంవత్సరం కాలంలో తిరిగి ఇస్తారు అనగా ఫిర్యాది గూడపాటి ప్రసాద్ మరియు గోడపాటి రాధికతో మాట్లాడించమని చెప్పగా గూడపాటి ప్రసాద్ మరియు అతని భార్య గూడపాటి రాధిక ఫిర్యాదికి ఫోన్ చేసి ఒక సంవత్సర కాలంలో మీ డబ్బులు తిరిగి ఇచ్చేస్తాము. ఇబ్బందుల్లో ఉన్నాము అప్పుగా ఇవ్వమనగా ఫిర్యాది గ్రామంలోని చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు నందు దాచి ఉంచిన 15 లక్షల రూపాయలు పసుమర్రు ఫిర్యాది బ్యాంకు ఖాతా నుండి వారి బ్యాంకు ఖాతా కు 18.07.2024 న NEFT ద్వారా బదిలీ చేయడం జరిగినట్లు,అయితే సదరు గడువు సంవత్సరం పూర్తయిన వెంటనే ఫిర్యాదు తన డబ్బులు తనకు తిరిగి చెల్లించమని అడుగగా వారి వద్ద నుండి ఎటువంటి స్పందన రాకపోయేటప్పటికి ఒక లీగల్ నోటీసు పంపడం జరిగినట్లు, అది అందుకున్న వెంటనే గుడిపాటి రాధిక మరియు గుడిపాటి ప్రసాద్ లు ఫిర్యాదుకు ఫోన్ చేసి లీగల్ నోటీసు పంపిస్తే డబ్బులు వస్తాయి అనుకుంటున్నావా అని తిడుతూ నానా దుర్భాషలాడుతూ బెదిరించి భయభ్రాంతులకు గురిచేసినందుకు గాను వారి పై చట్ట ప్రకారం చర్యలు తీసుకొనవలసిందిగా ఎస్పీ ని కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది.
చిలకలూరిపేట కు చెందిన విప్పర్ల ఏడుకొండలు అని అతను వారి దగ్గర బంధువు అయిన భూపతి వీరాంజనేయులు అను అతనికి షేర్స్ లో వ్యాపారం నిమిత్తం ఫిర్యాది మరియు ఫిర్యాదు స్నేహితుల వద్ద నుండి 11,70,000/- రూపాయలు అప్పుగా తీసుకున్నట్లు అప్పుగా తీసుకున్న డబ్బుకు 1% వడ్డీ ఇస్తానని చెప్పి రెండున్నర నెలల తరువాత భార్య మరియు పిల్లలను తీసుకొని ఇంటి నుండి వెళ్లిపోయినట్లు, అతని గురించి వారి తల్లిదండ్రులను అడుగగా ఎక్కడికి వెళ్ళినారో తెలియదు అని సమాధానం చెబుతున్నట్లు కావున తనకు న్యాయం చేయవలసిందిగా ఫిర్యాది ఎస్పీ ని కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది.
గురజాల మండలం పులిపాడు గ్రామానికి చెందిన తమ్మిశెట్టి దుర్గా పెద్ద కుమారుడు అయిన తమ్మిశెట్టి నవీన్ గత మూడు సంవత్సరాల క్రితం వారి ఇంటి పక్కన వారు చెట్టు కొమ్మలు కొట్టినప్పుడు స్తంభం పడి కరెంటు షాక్ తో చనిపోయినట్లు, అప్పుడు పెద్ద మనుషుల సమక్షంలో 2,00,000/- రూపాయలు ఇచ్చినట్లు, ఫిర్యాది భర్త డబ్బులు తీసుకొని వెళ్ళి ఎవరికి చెప్పకుండా రెండో వివాహం చేసుకున్నట్లు, ఫిర్యాదిని చీటికిమాటికి కొడుతూ అనేక ఇబ్బందులకు గురి చేస్తూ దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు, అతనికి ఫిర్యాది అత్తమామలు మరియు రెండవ భార్య సహకరిస్తున్నందుకు గాను వారిపై తగిన చర్యలు తీసుకొని న్యాయం చేయవలసిందిగా ఎస్పీ ని కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు వారి ఫిర్యాదులను రాసి పెట్టడంలో పోలీస్ సిబ్బంది సహాయ సహయ సహకారాలు అందించారు.ఈ పిజిఆర్ఎస్ నందు ఎస్పీ తో పాటు అదనపు ఎస్పీ (పరిపాలన) జేవి.సంతోష్ , నరసరావు పేట మహిళా పోలీస్ స్టేషన్ డి.ఎస్.పి ఎం.వెంకటరమణ పాల్గొన్నారు.
COMMENTS