మూడు లడ్డూలను సొంతం చేసుకున్న చరణ్ తేజ చిలకలూరిపేట పట్టణంలోని వార్డు 25, జగు పాలెం వినాయక పందిరి వద్ద జరిగిన గణపతి లడ్డు వేలంలో ...
మూడు లడ్డూలను సొంతం చేసుకున్న చరణ్ తేజ
చిలకలూరిపేట పట్టణంలోని వార్డు 25, జగు పాలెం వినాయక పందిరి వద్ద జరిగిన గణపతి లడ్డు వేలంలో మండలనేని చరణ్ తేజ మూడు లడ్డూలను దక్కించుకున్నారు.లడ్డుల వేలంపాటలో అత్యధిక ధర పలికిన ఈ మూడు లడ్డూలను సొంతం చేసుకున్న చిలకలూరిపేట జనసేన నియోజకవర్గ యువ నాయకులు చరణ్ తేజను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జగపాలెంలో ప్రత్యేక ఊరేగింపు నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా యువ నాయకులు చరణ్ తేజకు పురోహితులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వదించారు. చరణ్ తేజ సాధించిన విజయాన్ని స్థానికులు అభినందించారు.ఈ వేడుకలో పాల్గొన్నవారందరికీ యువ నాయకులుచరణ్ తేజ కృతజ్ఞతలు తెలిపారు.
COMMENTS